Health Tips: దంచి కొడుతోన్న వానలు.. ఈ జాగ్రత్తలు పాటించండి.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

Seasonal Diseases: పానీపూరి లాంటి ఫుడ్స్ వల్ల టైఫాడ్ లాంటి జబ్బులు వస్తున్నాయని, బయటి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది.

Health Tips: దంచి కొడుతోన్న వానలు.. ఈ జాగ్రత్తలు పాటించండి.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు..
Health Tips
Follow us

|

Updated on: Jul 12, 2022 | 1:12 PM

Seasonal Diseases: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. మరోవైపు జ్వరాలు, దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జర్వాలు ప్రభులుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు(డీహెచ్) శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, బయటి ఫుడ్ తీసుకోకుండా ఉండాలని కోరారు. ఆయన మాట్లాడుతూ, వివిధ శాఖల సమన్వయం తో ఆరోగ్య శాఖ పని చేస్తుందని, దోమలు, నీళ్ల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు పని చేస్తున్నామని ఆయన తెలిపారు.

  1. కలుషిత నీరు తీసుకువడం వల్ల వ్యాధుల బారిన పడుతుంటారని, రాష్ట్రంలో డెంగ్యూ తరవాత టైఫాడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని డీహెచ్ పేర్కొన్నారు.
  2. సీజనల్ వ్యాధుల సమయంలో ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకోవద్దని ప్రయివేట్ ఆసుపత్రులను ఆయన హెచ్చరించారు. అయితే, పానీపూరి లాంటి ఫుడ్ వల్ల టైఫాడ్ లాంటి జబ్బులు వస్తున్నాయని, బయటి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.
  3. ముఖ్యంగా ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటి నిల్వతో డెంగ్యూ బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు. కాచి, వడకట్టిన నీళ్లు తాగాలని, వేడి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
  4. పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాగా, సీజనల్ వ్యాధులతో పాటు కరోన కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఎలాంటి లక్షణాల కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రాణాల మీదకు రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పరిధిలో అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని, డ్యూ డేట్ ఉన్న వారు దగ్గరలోని ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని కోరారు. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
  7. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని, కరోనాతో పాటు, సీజనల్ వ్యాధుల నుంచి బయట పడాలంటే మాస్క్ తప్పనిసరి అని పేర్కొన్నారు.
  8. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్ లో కొత్త వేరియెంట్ వస్తే తప్ప.. ప్రస్తుతం కరోన గురించి ఆందోళనలు అవసరం లేదని భరోసా ఇచ్చారు.
  9. WHO కొత్త గైడ్ లైన్స్ ప్రకారం కాంక్టాక్ట్ ట్రెసింగ్ అవసరం లేదని తెలిపారు. కరోనా గురించి ఆందోళనలు అవసరం లేదని, కరోనా ఎండమిక్ స్టేజ్‌కి వచ్చిందని, సీజనల్ డీసీజ్‌లోకి కరోనా చేరిందని ఆయన అన్నారు.