Viral Video: పిల్లి, పాముల హోరాహోరీ పోరు.. చివరకు ఏమైందంటే? నెట్టింట వైరల్ వీడియో

Cat Vs Snake Viral Video: ఎదురుగా వచ్చిన పాములో పోరాడేందుకు ఓ పిల్లి సిద్ధమైంది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: పిల్లి, పాముల హోరాహోరీ పోరు.. చివరకు ఏమైందంటే? నెట్టింట వైరల్ వీడియో
Cat Vs Snake Viral Vide
Follow us
Venkata Chari

|

Updated on: Jul 11, 2022 | 6:41 PM

నెట్టింట్లో ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్లకు నచ్చడంతో తెగ వైరల్ చేస్తుంటారు. ఇందులో కొన్ని వీడియోలు నవ్విస్తే, మరికొన్ని తెగ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇందులో జంతవులకు సంబంధించిన వీడియోల గురించి చెప్పనక్కర్లేదు. వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. మాములుగా మనకు పాము కనిపిస్తే, జడసుకుని చస్తాం. అక్కడి నుంచి పారిపోతాం. అయితే, మనుషులే కాదు, చాలా జంతువులకు కూడా పామును చూసి దూరంగా పారిపోతుంటాయి. ఈ క్రమంలో ఓ పిల్లికి పాము కనిపించింది. దీంతో ఈ రెండు జంతువుల మధ్య సాగిన పోరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పాములు కనిపిస్తాయి. వాటిలో చాలా విషపూరితమైనవి కూడా ఉన్నాయి. పాములతో నిర్భయంగా పోరాడే జంతువులు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియోలో ఓ పిల్లి ఆ పాత్రను పోషించింది. ఇందులో పిల్లి పాముతో నిర్భయంగా పోరాడుతన్నట్లు వీడియోలో చూడొచ్చు. పిల్లి దాడితో ఒక్కసారిగి భయపడిన పాము.. ముడుచుకుని అలాగే చూస్తుండిపోయింది. పిల్లి పాముతో పోరాడడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో Instagramలో bestpet.in అనే ఖాతా నుంచి షేర్ చేశారు. నిర్భయంగా పాముపై దాడికి దిగిన పిల్లి అంటూ క్యాప్షన్ అందించారు. ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించగా, ఎనిమిది వేల మందికి పైగా లైక్ చేశారు.