Huge Shape : నీటి అడుగున కదులుతున్న భారీ ఆకారం.. ఏంటని చూడగా ఫ్యూజులౌట్..!

Huge Shape : నీటి అడుగున కదులుతున్న భారీ ఆకారం.. ఏంటని చూడగా ఫ్యూజులౌట్..!

Anil kumar poka

|

Updated on: Jul 11, 2022 | 8:53 PM

సరస్సు లేదా సముద్రంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లినవారికి అప్పుడప్పుడూ ఊహించని పరిణామాలు ఎదురవుతుండటం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. గాలానికి బోలెడన్ని చేపలు చిక్కాల్సిందిపోయి..


సరస్సు లేదా సముద్రంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లినవారికి అప్పుడప్పుడూ ఊహించని పరిణామాలు ఎదురవుతుండటం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. గాలానికి బోలెడన్ని చేపలు చిక్కాల్సిందిపోయి.. పాములు పడటం.. లేదా.. మరేదైనా వస్తువులు చిక్కిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఇక్కడ సీన్ కొంచెం విభిన్నంగా ఉంటుంది. దగ్గరలోని సరస్సులో చేపలు పట్టుకునేందుకు వెళ్లిన ఓ యువకుడికి.. స్టన్నింగ్ సీన్ ఎదురైంది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సమ్మర్‌లో అప్పుడప్పుడూ స్థానికంగా ఉండే సరస్సుల్లో ఫిషింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి దగ్గరలోని సరస్సుకు చేపల కోసం వెళ్లాడు. బోట్‌పై నది మధ్యకు వెళ్లి గాలానికి ఎర కట్టి నీటిలోకి వేశాడు. బోలెడన్ని చేపలు పడతాయనుకున్న అతడికి ఓ భారీ చేప వచ్చి షాక్ ఇచ్చింది. అతడి బోట్ పక్క నుంచి ఆ చేప ఈదుకుంటూ వెళ్లింది. దాని భారీ ఆకారాన్ని చూసి మొదట భయపడిన అతడు.. ఆ తర్వాత చేపను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 11, 2022 08:53 PM