Two Wheeler Loan: టూవీలర్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ఇబ్బందులే..
బైక్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. వాటిని అనుసరించాలి. అందులో మొదటిది వడ్డీ రేట్లు. బైక్ లోన్స్‌కు ఉన్న డిమాండ్ కారణంగా చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి.
రెగ్యులర్‌గా ఆఫీసులకు వెళ్ళేవారికి.. ఎక్కువగా ఏదైనా పనుల మీద ఊరిలో తిరిగే వారికీ బైక్ చాలా అనువైనది. బైక్ చేతిలో ఉంటే పనులు చక్కబెట్టుకోవడం సులువుగా ఉంటుంది. బైక్ కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే, బైక్ కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బు అందుబాటులో ఉండదు. అటువంటప్పుడు టూ వీలర్ లోన్ కోసం ప్రయత్నిస్తారు. ఇది చాలామంది చేసే పని. అయితే, కొన్ని చిన్న పొరపాట్ల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అందుకే బైక్ లోన్ తీసుకోవడానికి ఏమి చేయాలో ఇప్పడు తెలుసుకుందాం..
బైక్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. వాటిని అనుసరించాలి. అందులో మొదటిది వడ్డీ రేట్లు. బైక్ లోన్స్‌కు ఉన్న డిమాండ్ కారణంగా చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఇప్పుడు పోటీలో నిలవడం కోసం వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. అయితే, ఇటీవల కాలంలో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచడంతో ఆ ప్రభావం కొంత ఉంది. ఇప్పుడు మళ్ళీ టూ వీలర్ లోన్స్ పై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. సాధారణంగా టూ వీలర్ లోన్స్‌పై వడ్డీ రేట్లు మనం ఎంచుకునే కాల వ్యవధిపై కూడా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ వడ్డీ రేటు కాల వ్యాధిని అనుసరించి 7 నుంచి 18 శాతం మధ్యలో ఉన్నాయి. ఇక టూవీలర్ కొనుక్కోవలనే వారికి పూర్తి మొత్తం లోన్స్‌గా ఫైనాన్స్ సంస్థలు ఇవ్వవు. కొంత డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లోన్ టూ వాల్యూ అంటే LTV ఆధారంగా టూ వీలర్ లోన్ డౌన్ పేమెంట్ ఉంటుంది. వెహికల్ విలువలో ఎంత వరకూ లోన్ ఇవ్వచ్చనే కాలిక్యులేషన్ ఇది. సాధారణంగా బ్యాంకులు 80 శాతం వరకూ లోన్ గా ఇస్తాయి. అంటే లక్షరూపాయాలకు ఒక బైక్ కొంటె 80 లక్షల వరకూ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన 20 వేల రూపాయలు డౌన్ పేమెంట్‌గా కట్టాల్సి ఉంటుంది.
ఇక లోన్ తీసుకునేటప్పుడు మనం ఒక అప్లికేషన్ పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ నింపాలి. అప్లికేషన్‌లో తప్పులు మన లోన్ అవకాశాలను తగ్గిస్తాయి. ఇక టూ వీలర్ లోన్ కోసం ఒక స్థిరమైన అడ్రస్ ఉండాలి. ఎడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూస్తారు. అలాగే టూ వీలర్ లోన్ కోసం కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. అలాగే లోన్ కాలపరిమితి ముగిసేసారికి 65 ఏళ్లు నిండకుండా వయసు ఉన్నవారికే లోన్ అవకాశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. ఏదైనా స్థిర ఉద్యోగం ఉండాలి. ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తుంటే ఐటీ రిటర్న్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఐడీ ప్రూఫ్ లు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, శాలరీ స్లిప్స్ (కనీసం 3 నెలలు) లేదా ఐటీ రిటర్న్స్ (కనీసం మూడేళ్లు), బ్యాంక్ స్టేట్మెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.
గతంలో ఏదైనా లోన్ తీసుకోవాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు బ్యాంకుకు సంబంధించిన రిప్రజెంటిటీవ్స్ షోరూమ్స్ వద్దే అందుబాటులో ఉంటున్నారు. వారు మీకు లోన్ ఎలిజిబిలిటీ దగ్గర నుంచి ఈఎంఐల వరకూ లెక్కలు చూసి చెబుతారు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు బ్యాంక్ రిప్రజెంటిటివ్స్‌తో లోన్ వడ్డీ రేటు గురించి స్పష్టంగా మాట్లాడుకోవడం. ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేటు పై లోన్ ఇస్తుందో చూసుకుని లోన్ అప్లై చేసుకోవాలి.