Viral Video: చేపల కోసం వల వేశాడు.. గాలానికి చిక్కింది చూసి ఖంగుతిన్నాడు..
సమ్మర్‌లో అమెరికన్లు ఫిషింగ్‌కు వెళ్లడం సర్వసాధారణం. అక్కడ కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాలు..
సమ్మర్‌లో అమెరికన్లు ఫిషింగ్‌కు వెళ్లడం సర్వసాధారణం. అక్కడ కొన్ని ప్రాంతాల్లో నివసించే జనాలు.. దగ్గరలోని సరస్సుకు చేపల వేట కోసం వెళ్తుంటారు. ఇంకొందరైతే.. తమ దగ్గరున్న బోట్‌ను తీసుకుని అలా.. సరస్సు మధ్యకు వెళ్లి చేపలు పడతారు. ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా.. ఇలాంటి కోవకు చెందిన స్టోరీనే. అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఇంటికి దగ్గరలోని సరస్సులో చేపల వేటకు వెళ్లాడు. ఏదైనా పెద్ద చేప పడితే.. ఎంచక్కా కూర చేసుకుని తినొచ్చు అనుకుని.. గాలానికి ఎర కట్టి సరస్సులోకి వేశాడు. కొంతసేపు వేచి చూడగా.. గాలం బరువెక్కింది. ఏదో పెద్ద చేప పడినట్లు ఉందిలే అనుకుని బలంగా బయటికి లాగాడు. అంతే! వలకు చిక్కిన చేపను చూసి అతడి కళ్లు జిగేలుమన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
ఇవి కూడా చదవండిView this post on Instagram