vitamin – D: విటమిన్ – డి ఎక్కువైనా కష్టమే.. తక్కువైనా కష్టమే.. వైద్యులు ఏమంటున్నారంటే

విటమిన్ - డి (Vitamin D) శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అది తక్కువైతే వచ్చే అనారోగ్య సమస్యలు కూడా మనకు తెలుసు.. అది సరే.. విటమిన్ - డి ఎక్కువైతే మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో....

vitamin - D: విటమిన్ - డి ఎక్కువైనా కష్టమే.. తక్కువైనా కష్టమే.. వైద్యులు ఏమంటున్నారంటే
Vitamin D
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 13, 2022 | 6:43 PM

విటమిన్ – డి (Vitamin D) శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అది తక్కువైతే వచ్చే అనారోగ్య సమస్యలు కూడా మనకు తెలుసు.. అది సరే.. విటమిన్ – డి ఎక్కువైతే మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా పనిచేయడానికి విటమిన్‌ – డి చాలా అవసరం. ఎముకలు పటిష్ఠంగా ఉండటానికి, నిస్సత్తువ, నిద్రలేమి, అలసటను తగ్గించడంలో చాలా బాగా పని చేస్తుంది. మన శరీరానికి కావాల్సిన విటమిన్ – డి సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో ఎండలోకి వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. ఫలితంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు (Health Problems) తలెత్తుతున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు విటమిన్‌ – డి సప్లిమెంట్లు వాడుతున్నారు. అయితే విటమిన్లు శరీరానికి అవసరం. కానీ తగిన పరిమాణంలో తీసుకుంటేనే దాని వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అంతే గానీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే తీవ్ర విపత్కర పరిణామాలు తలెత్తుతాయి. చాలా మంది విటమిన్‌ – డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో ఎముకలు బలం తగ్గిపోవడంతో పాటు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విటమిన్ డీ ను అవసరానికి మించి తీసుకుంటే అది విషపూరితం అవుతుంది. సాధారణంగా మన శరీరంలో 20-40 మిల్లీగ్రామ్ వరకు విటమిన్‌ డి ఉంటే సరిపోతుంది. ఇది ఎక్కువైతే వాంతులు, మలబద్ధకం, ఆకలి లేకపోవడం, గందరగోళం, నిరాశ, మానసిక అనారోగ్యం వంటి దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది. విటమిన్ డీ ను సహజంగా పొందేందుకు వారానికి కనీసం రెండు రోజులు ఉదయాన్నే ఎండలో కొంత సమయం గడపాలి. చేపలు, పాలు, పప్పులు వంటి ఆహార పదార్థాలను డైట్ లో భాగం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.