APSRTC: సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇకపై..

బస్‌ టికెట్లలో రాయితీ పొందేందుకు ఇకపై డిజిటల్‌ ఆధార్‌ కార్డు చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈమేరకు డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.

APSRTC: సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇకపై..
Apsrtc
Follow us
Venkata Chari

|

Updated on: Jul 13, 2022 | 11:45 AM

సీనియర్ సిటిజన్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రావాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) శుభవార్తను అందించింది. ఆదాయాలను సమకూర్చుకోవడంతో పాటు ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎన్నో ప్లాన్స్, పథకాలను ప్రవేశపెడుతోన్న ఏపీఎస్ ఆర్టీసీ.. తాజాగా సీనియర్ సిటిజన్లకు పలు రాయితీలను ప్రకటించింది. బస్‌ టికెట్లలో రాయితీ పొందేందుకు ఇకపై డిజిటల్‌ ఆధార్‌ కార్డు చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈమేరకు డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.

అలాగే, టికెట్ల ధరల్లో సీనియర్‌ సిటిజన్లకు 25 శాతంమేర రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ కోసం సీనియర్‌ సిటిజన్‌ ఐడీ కార్డు, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్‌ ఐడీ కార్డు, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తామని ప్రకటించింది. వీటితోపాటు డిజిటల్‌ ఆధార్‌ కార్డును కూడా ఈ లిస్టులో చేర్చుతున్నట్లు ఆర్టీసీ ఈడీ కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.