Sake Sailajanath: రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దు.. సీఎం జగన్, చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ లేఖ..
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టొద్దంటూ ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టొద్దంటూ ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ కోరారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని జగన్, చంద్రబాబును లేఖలో కోరారు శైలజానాథ్. బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయానికి నిరసనగా ద్రౌపది ముర్ముకి వ్యతిరేకంగా, యశ్వంత్ సిన్హాకు మద్దతుగా ఓటేస్తామని వైఎస్సార్సీపీ, తెలుగుదేశం బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీని ఈ రెండు పార్టీలు డిమాండ్ చేయాలన్నారు.
కేంద్రాన్ని నిలదీయాలి..
‘ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలుపరచలేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని సమస్యలకు జగన్ బానిసత్వమే కారణం. సీఎం జగన్ మౌన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం ముఖ్యమంత్రి బాధ్యత. కానీ ముఖ్యమంత్రి విజ్ఞాపనలు కేంద్రం చెత్తకుప్పలో పడేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికకు వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు పోటీపడి మద్దతిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలి. సొంత విషయాలు మాట్లాడుకోవడానికి జగన్‌ను సీఎం చేయలేదు. ఏపీ ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. వైసీపీ, తెలుగుదేశం నాయకులను చూసి ఏపీ ప్రజలు సిగ్గుపపడుతున్నారు’ అని లేఖలో విమర్శించారు శైలజానాథ్.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..