Hero Vishal: మరోసారి నేను పెళ్లికి రెడీ అంటోన్న విశాల్.. నమ్మకం లేదంటున్న ఫ్యాన్స్..

Kollywood: ఇదిగో పులి అంటే అదిగో మేక అన్నట్లుంది విశాల్‌ వ్యవహారం. పెళ్లి విషయంలో ఈ హీరో వ్యవహరిస్తోన్న తీరు అభిమానులను గందరగోళంలో పడేస్తోంది. పెళ్లెప్పుడని ఎప్పుడు అడిగినా కూడా.. ఇదిగో ఇప్పుడే అంటారు విశాల్‌. కానీ ఆ అప్పుడు ఎప్పుడు బాబూ అంటే మాత్రం సైలెంట్..

Hero Vishal: మరోసారి నేను పెళ్లికి రెడీ అంటోన్న విశాల్.. నమ్మకం లేదంటున్న ఫ్యాన్స్..
Hero Vishal
Follow us

|

Updated on: Jul 09, 2022 | 1:06 PM

Kollywood: ఇదిగో పులి అంటే అదిగో మేక అన్నట్లుంది విశాల్‌ వ్యవహారం. పెళ్లి విషయంలో ఈ హీరో వ్యవహరిస్తోన్న తీరు అభిమానులను గందరగోళంలో పడేస్తోంది. పెళ్లెప్పుడని ఎప్పుడు అడిగినా కూడా.. ఇదిగో ఇప్పుడే అంటారు విశాల్‌. కానీ ఆ అప్పుడు ఎప్పుడు బాబూ అంటే మాత్రం సైలెంట్ అయిపోతారు. పైగా ఇప్పటికే రెండుసార్లు పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం కాస్తా పెటాకులైంది. దీంతో తన పెళ్లి విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఈ యాక్షన్ హీరో. మరి అదేంటి..? అప్పుడెప్పుడో 17 ఏళ్ల కింద వచ్చిన పందెంకోడి సినిమా నుంచి విశాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. మాస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు . కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. వివాదాలు, ప్రేమ వ్యవహారాలతోనూ బాగానే పాపులర్ అయ్యారు విశాల్. మొదట్లో శరత్‌కుమార్‌ గారాల పట్టి వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తను నాకు చిన్నప్పటి నుంచి తెలుసని.. తన లైఫ్‌లోని అప్ అండ్ డౌన్స్‌లో తోడుగా ఉందని ఆ సమయంలో చెప్పుకొచ్చాడు విశాల్. అదే సమయంలో శరత్ కుమార్‌తో తనకు అంత మంచి రిలేషన్ లేదనే విషయాన్ని కూడా ఒప్పుకున్నారు. ఇక నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో తనను కాకుండా.. తండ్రి వైపు వరలక్ష్మి నిలబడటంతో విశాల్‌తో బ్రేకప్ అయిపోయిందనే కథనాలు తమిళనాట ఉన్నాయి. దీనిపై విశాల్ ఇప్పటికీ అవును.. కాదు ఏదీ చెప్పకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు

ఇక రెండేళ్ల క్రితం అర్జున్ రెడ్డి ఫేం అనీషా రెడ్డితో కలిసి ఉంగరాలు మార్చుకున్నాడు విశాల్. అయితే ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులకే దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అప్పట్నుంచి సోలోగానే ఉన్న ఈయన.. తాజాగా తాను మరోసారి ప్రేమలో పడినట్లు తెలిపారు. తనకు పెద్దలు కుదిర్చిన సంబంధాలు సెట్ అవ్వవని.. తన ప్రేయసిని త్వరలోనే పరిచయం చేస్తానంటున్నాడు. మరి కనీసం ఈసారైనా విశాల్ పెళ్లి పీటలెక్కుతాడా లేదా అనేది ఆసక్తిగా గమనిస్తున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సామాన్యుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విశాల్‌. ప్రస్తుతం లాఠీ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. నటి సునయన హీరోయిన్‌గా నటిసస్తోంది. వినోద్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు తుప్పరివాలన్‌2 (తెలుగులో అభిమన్యుడు2), మార్క్‌ ఆంటోని చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నాడీ కోలీవుడ్‌ హీరో.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!