Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ టీజర్ అంతా బాగుంది కానీ అదొక్కటే సమస్య..
బాహుబలి తర్వాత భారీ చిత్రాలకు లోటే లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా పీరియాడికల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు దర్శకులు. తాజాగా మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్‌తో వచ్చేస్తున్నారు.
బాహుబలి తర్వాత భారీ చిత్రాలకు లోటే లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా పీరియాడికల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు దర్శకులు. తాజాగా మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan)తో వచ్చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. మరి మణి డ్రీమ్ ప్రాజెక్ట్ టీజర్ ఎలా ఉంది.. అంతమంది స్టార్ హీరోలకు న్యాయం జరిగిందా.. పొన్నియన్ సెల్వన్ విషయంలో ఆడియన్స్ కంప్లైంట్ ఏంటి..? కథ బాగుంటే వందల కోట్లైనా పెట్టొచ్చని నిర్మాతలకు ధైర్యం తీసుకొచ్చింది బాహుబలి. అందుకే దాని తర్వాత సైరాతో పాటు చాలా చారిత్రాత్మక చిత్రాలు వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి. తాజాగా బింబిసార అంటూ భారీ పీరియాడికల్ డ్రామా చేస్తున్నారు కళ్యాణ్ రామ్. మరోవైపు పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మణిరత్నం. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణి. తాజాగా తొలిభాగం టీజర్ విడుదలైంది.
టీజర్ అంతా చాలా గ్రాండియర్‌గా ఉంది. అంతేకాకుండా స్క్రీన్‌కు సరిపడా స్టార్స్ కూడా ఉన్నారు. చోళుల కాలం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఇందులో కరికాలన్‌గా విక్రమ్.. అరుణ్ మోళి వర్మన్‌గా జయం రవి.. వల్లవరాయన్ వాందివదేవన్‌గా కార్తి.. నందినిగా ఐశ్వర్యారాయ్.. కుందవై పిరిత్తియార్‌గా త్రిష నటిస్తున్నారు. వీళ్ళు కాకుండా విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాల, పార్తీబన్, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ తెలుగు టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసారు. టీజర్ అంతా ఎక్కువగా యుద్ధాలపైనే ఫోకస్ చేసారు మణిరత్నం. బాహుబలి తరహాలోనే చాలా గ్రాండ్ లుక్ పొన్నియన్ సెల్వన్‌లో కనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమాకు టైటిల్ తెలుగులో పెట్టుంటే బాగుండేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ మధ్య తమిళ్ టైటిల్స్‌తోనే వస్తున్న సినిమాలపై విమర్శలు బాగానే వస్తున్నాయి. ఇక పొన్నియన్ సెల్వన్ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ను రాబడుతోంది ఈ టీజర్. తెలుగు 2.7 మిలియన్ వ్యూస్, తమిళ్ లో 5.7, కన్నడలో 0.16 , హిందీలో 1.8, మలయాళంలో 0.73 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది ఈ టీజర్. సెప్టెంబర్ 30న పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం విడుదల కానుంది.