Varun Dhawan: బాలీవుడ్ బడా హీరోలకే సాధ్యం కాలేదు.. ఈ యువ హీరో చేసి చూపించాడు.!

బాలీవుడ్‌లో సీనియర్స్ ఫెయిల్ అవుతున్నా... యంగ్ జనరేషన్ హీరోలు మాత్రం సక్సెస్‌ల విషయంలో జోరు చూపిస్తున్నారు..

Varun Dhawan: బాలీవుడ్ బడా హీరోలకే సాధ్యం కాలేదు.. ఈ యువ హీరో చేసి చూపించాడు.!
Varun Dhawan
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 08, 2022 | 8:32 PM

బాలీవుడ్‌లో సీనియర్స్ ఫెయిల్ అవుతున్నా… యంగ్ జనరేషన్ హీరోలు మాత్రం సక్సెస్‌ల విషయంలో జోరు చూపిస్తున్నారు. నిన్నగాక మొన్న కార్తీక్ ఆర్యన్ బిగ్‌ హిట్‌తో అలరిస్తే… తాజాగా వరుణ్ ధావన్‌ కూడా ఇంట్రస్టింగ్ రికార్డ్ సెట్‌ చేశారు.

భూల్‌ భులయ్యా 2 తరువాత బాలీవుడ్ భవిష్యత్తు మీద ఆశలు కల్పించిన మరో మూవీ జుగ్ జుగ్ జియో. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా హిందీ మార్కెట్ మీద ఆశలు కల్పించింది. అంతేకాదు ఈ సినిమాతో హీరో వరుణ్ ధావన్ ఇంట్రస్టింగ్ రికార్డ్‌ను సెట్‌ చేశారు. యంగ్ జనరేషన్‌లో హయ్యస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ ఉన్న హీరోగా అవతరించారు వరుణ్‌.

జుగ్ జుగ్ జియో మూవీతో కలిపి వంద కోట్ల మార్క్‌ను రీచ్ అయిన వరుణ్ సినిమాలు పదకొండు. పదేళ్ల కెరీర్‌లోనే ఈ ఫీట్ సాధించి సత్తా చాటారు ఈ స్టార్‌ కిడ్‌. కెరీర్‌లో వరుణ్ ఇప్పటి వరకు 14 సినిమాల్లో నటిస్తే వాటిలో 11 సినిమాలు వందకోట్ల మార్క్‌ను రీచ్ అయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో మోస్ట్ బ్యాంకబుల్ యాక్టర్‌గా అవతరించారు వరుణ్‌.

ఈ సక్సెస్‌ విషయంలో వరుణ్ ధావన్‌ మాత్రం అంత హ్యాపీగా లేరట. ఇన్నాళ్లు మేకర్స్ తనకు కమర్షియల్‌ ఫార్ములా సినిమాలు మాత్రమే ఆఫర్ చేస్తూ వచ్చారని… దీంతో సక్సెస్‌లు వచ్చినా… నటుడిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ మాత్రం రాలేదని ఫీల్ అవుతున్నారు.

కానీ బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే కంటెంట్‌ డ్రివెన్‌ స్టోరీల ట్రెండ్ మొదలవుతుందన్న వరుణ్ థావన్‌… ఎవరైనా అలాంటి మూవీస్‌లో ఆఫర్ ఇస్తే తాను చేసేందుకు రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చారు. హీరోగా ఆల్‌ టైమ్‌ రికార్డ్ సెట్‌ చేసినా… అన్ని సినిమాలు నెంబర్ గేమ్‌ కోసం చేయటం తనకు ఇష్టం లేదంటున్నారు బాలీవుడ్ బ్యాంకబుల్‌ స్టార్‌.