AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana: అలా చేయడం వల్లే సినిమా ప్లాఫ్ అయింది.. ధాకడ్ మూవీ రిజల్ట్స్ పై కంగనా కామెంట్స్

ధాకడ్ మూవీ పరాజయంపై బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) స్పందించారు. ఈ చిత్రం కారణంగా నిర్మాత ఆస్తులు అమ్ముకున్నాడని వస్తున్ నవార్తలను ఆమె ఖండించారు. ఈ మేరకు....

Kangana: అలా చేయడం వల్లే సినిమా ప్లాఫ్ అయింది.. ధాకడ్ మూవీ రిజల్ట్స్ పై కంగనా కామెంట్స్
Kangana
Ganesh Mudavath
|

Updated on: Jul 09, 2022 | 6:17 AM

Share

ధాకడ్ మూవీ పరాజయంపై బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) స్పందించారు. ఈ చిత్రం కారణంగా నిర్మాత ఆస్తులు అమ్ముకున్నాడని వస్తున్ నవార్తలను ఆమె ఖండించారు. ఈ మేరకు నిర్మాత దీపక్ ముకుత్ అంతకు ముందు కొన్ని కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన కామెంట్లపై స్పందించిన కంగనా.. ఆ సినిమాకు పెట్టిన ఖర్చులను ప్రొడ్యూసర్ తిరిగి పొందినట్లు వెల్లడించారు. నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్మకోలేదని, సినిమా రిరజల్ట్ ఎలా ఉన్నా తాము సంతృప్తికరంగానే ఉన్నట్లు చెప్పారు. సినిమా గురించి చేసిన వ్యతిరేక ప్రచారం కారణంగానే అది పరాజయం పాలైందని అభిప్రాయపడ్డారు. నెగెటివ్‌ ప్రమోషన్‌ చేసే వారు గంగూబాయి కాఠియావాడి, జుగ్‌జుగ్‌జీయో,83 లాంటి ఫ్లాప్‌ సినిమాల గురించి ఎందుకు రాయరని ప్రశ్నించారు. కాగా ప్రస్తుతం ‘ధాకడ్‌’ జీ5 ఓటీటీలో ప్రసారం అవుతోంది. సుమారు 80కోట్ల బడ్జెట్‌తో రజనీష్‌ ఘాయ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. కేవలం రూ.4 కోట్లుతో దారుణంగా విఫలమైంది.కంగనా కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచింది.

కాగా..‘ధాకడ్’ సినిమాకు ₹80 కోట్ల నుంచి ₹90 కోట్ల వరకు ఖర్చు అయ్యింది.ఈ లెక్కలను బట్టి.. ఈ నాలుగైదు దశాబ్దాల్లోనే ఈ రేంజ్ ప్లాప్ మరో సినిమాకి దక్కలేదు. రజనీష్ ఘై దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్య దత్తా కూడా నటించారు.పోస్టర్ల డబ్బులు కూడా వెనక్కి రాకపోవడం గమనార్హం. షోలు పడిన చోట ఆక్యుపెన్సీ కేవలం 0-05% వరకు మాత్రమే ఉంది. ఒకానొక సమయంలో దేశమంతా కలిపి ఇరవై టికెట్లే అమ్ముడయ్యాయంటే సినిమా ఎంత ఘోరంగా విఫలమయ్యిందో అర్థం చేసుకోవచ్చు.