Adipurush: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ లేటెస్ట్ అప్డేట్.. ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోన్న విషయం తెలిసిందే.. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక సాహో సినిమాతో ఆ రేంజ్ ను కంటిన్యూ చేశాడు డార్లింగ్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోన్న విషయం తెలిసిందే.. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక సాహో సినిమాతో ఆ రేంజ్ ను కంటిన్యూ చేశాడు డార్లింగ్. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే రాబట్టింది. దాంతో ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అటెన్షన్ ఏర్పడుతోంది. రీసెంట్ గా వచ్చిన రాధేశ్యామ్ సినిమా బెడిసికొట్టినప్పటికీ ఆ ఎఫెక్ట్ డార్లింగ్ పైన పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. డార్లింగ్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రామాయణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్నాడు. అదే విధంగా సందీప్ వంగ డైరెక్షన్లో స్పిరిట్, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమాలు చేస్తున్నాడు.
వీటిలో ఆదిపురుష్ సినిమా గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో అటు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం చాలా వరకు ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా నెమ్మదిగా కొనసాగుతోంది అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ టెస్టింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ స్క్రీన్ పై ఆదిపురుష్ సినిమాని చిత్ర యూనిట్ సభ్యులు చూడబోతున్నారట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.