AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvan: మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ టీజర్‌ వచ్చేసింది.. కట్టి పడేస్తున్న స్టన్నింగ్‌ విజువల్స్‌..

Ponniyin Selvan: యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది...

Ponniyin Selvan: మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ టీజర్‌ వచ్చేసింది.. కట్టి పడేస్తున్న స్టన్నింగ్‌ విజువల్స్‌..
Narender Vaitla
|

Updated on: Jul 08, 2022 | 8:06 PM

Share

Ponniyin Selvan: యావత్‌ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. విక్రమ్‌, కార్తీ, ఐశ్యర్య రాయ్‌, త్రిష, శోభితా ధూళిపాళ ఇలా చెప్పుకుంటే ఇందులో నటిస్తోన్న తారల జాబితా చాలా పెద్దది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 30న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది.

ఇందులో భాగంగానే తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతీ సన్నివేశంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తోంది. రాజులు, రాజ్యాలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ దృశ్యకావ్యంలో విజువల్స్‌ స్టన్నింగ్‌గా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్‌లో రాజసం ఉట్టిపడేలా చిత్రీకరించారు. ముఖ్యంగా పాత్రల వేషాధారణ హైలట్‌గా నిలిచియాయి. ఐశ్వర్య, త్రిష తమ అందంతో మెస్మరైజ్‌ చేస్తే విక్రమ్‌, కార్తీల పాత్రను బాగా డిజైన్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఇక టీజర్‌లో విక్రమ్‌ చెప్పే.. ‘ఈ రక్తం, పోరాటం, పాట… అంతా దాన్ని మర్చిపోవడానికే! ఆమెను మర్చిపోవడానికి, నన్ను నేనే మర్చిపోవడానికి’ డైలాగ్‌ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఏఆర్‌ రెమహాన్‌ అందించిన మ్యూజిక్‌ అదరగొడుతోంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక తెలుగు వెర్షన్‌ టీజర్‌ను మహేష్‌ బాబు విడుదల చేశారు. ట్విట్టర్‌లో టీజర్‌ను షేర్‌ చేసిన మహేష్‌..’నా అభిమాన దర్శకుల్లో మణిరత్నం సార్‌ ఒకరు. పొన్నియన్‌ సెల్వన్‌-1 టీజర్‌ను లాంచ్‌ చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమా చూడడానికి ఎంతో ఆతృతతో ఉన్నాను’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలియకపోతే నష్టపోతారు
టూ వీలర్ కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలియకపోతే నష్టపోతారు
మక్కాలో మహా కూటమి.. సౌదీ, టర్కీ, పాక్ భారీ రక్షణ ఒప్పందం
మక్కాలో మహా కూటమి.. సౌదీ, టర్కీ, పాక్ భారీ రక్షణ ఒప్పందం
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా?
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా?
సోనెట్, సెల్టోస్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు.. ఎన్ని లక్షలో తెలుసా
సోనెట్, సెల్టోస్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు.. ఎన్ని లక్షలో తెలుసా
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మెగా డాటర్
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
మెరుగైన బ్రేకింగ్‌తో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్ ప్రత్యేకతలు ఇవే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
కార్లపై భారీ తగ్గింపులు ప్రకటించిన టాటా.. ఎన్ని లక్షలంటే
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
అందుకే బూతు సినిమాల్లో నటించా.. అసలు విషయం చెప్పిన ప్రముఖ నటి
శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి?
శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి?
పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం..
పసిడి మళ్లి రికార్డ్‌.. తులంపై రూ.6 వేలు పెరిగిన బంగారం..