Krithi shetty: ‘రామ్‌తో అంత ఈజీ కాదు అనుకున్నాను.. కానీ..’ ఆసక్తికర విషయాలు పంచుకున్న బేబమ్మ..

Krithi shetty: ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నిజంగానే ఉప్పెనలా దూసుకొచ్చింది అందాల తార కృతి శెట్టి. తొలి చిత్రంతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది...

Krithi shetty: 'రామ్‌తో అంత ఈజీ కాదు అనుకున్నాను.. కానీ..' ఆసక్తికర విషయాలు పంచుకున్న బేబమ్మ..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 08, 2022 | 6:38 PM

Krithi shetty: ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నిజంగానే ఉప్పెనలా దూసుకొచ్చింది అందాల తార కృతి శెట్టి. తొలి చిత్రంతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. అందం, అభినయం కలగలిపిన ఈ చిన్నది తక్కువ కాలంలో ఎక్కువ ఆఫర్లు దక్కించుకుంది. కృతి ట్యాలెంట్‌కు ఫిదా అయిన టాలీవుడ్‌ వరుస ఆఫర్లతో ఆహ్వానించింది. ప్రస్తుతం కృతి చేతిలో వరుస సినిమాలతో బజీగా ఉంది. వీటిలో రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ది వారియర్‌’ ఒకటి.

ఈ సినిమాలో రామ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. లింగు స్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే కృతి శెట్టి తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వారియర్‌ సినిమాకు ఓకే చేసిన తర్వాత రామ్‌ సినిమాలు చూశాను. అతని ఎనర్జీ చూశాక నేను ఆ ఎనర్జికీ మ్యాచ్‌ అవుతానే కాదోనని భయపడ్డాను. ముఖ్యంగా బుల్లెంట్‌ సాంగ్‌కు అతనితో డ్యాన్స్‌ ఎలా అని కొంచెం నెర్వస్‌గా కూడా ఫీలయ్యాను. కానీ షూటింగ్‌ మొదలయ్యాక అంతా ఫ్లోలో వెళ్లిపోయింది. నేను కూడా డ్యాన్స్‌ ఎంజాయ్‌ చేశాను’ అని చెప్పుకొచ్చింది.

ఇక కథల ఎంపిక గురించి మాట్లాడుతూ.. కథ వినేటప్పుడు తాను ఎంటర్‌టైన్‌ అయితే, ఆడియన్స్‌ కూడా అంత ఎంటర్‌టైన్‌ అవుతారని అనుకుంటానని తెలిపిందీ బ్యూటీ. యాక్షన్‌ రోల్స్‌లో నటించాలని ఉందని, అయితే అది ఇప్పుడే కాదని తన డ్రీమ్‌ రోల్‌ గురించి చెప్పుకొచ్చింది అందాల కృతి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..