Tollywood: తెలుగు తెరపై ఐటమ్‌ ట్రెండ్‌.. మాస్ బీట్స్‌కు స్టెప్పులేస్తున్న అందాల తారలు..

తెలుగు తెర మీద స్పెషల్‌ సాంగ్స్ ఎప్పటి నుంచో ఉన్నా... రీసెంట్‌ టైమ్స్‌లో మరోసారి ఈ ట్రెండ్‌ హాట్ టాపిక్ అవుతోంది. ఊ అంటావా మావ ఉఉ అంటావా..

Tollywood: తెలుగు తెరపై ఐటమ్‌ ట్రెండ్‌.. మాస్ బీట్స్‌కు స్టెప్పులేస్తున్న అందాల తారలు..
Tollywood Item Song
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 08, 2022 | 8:32 PM

తెలుగు తెర మీద స్పెషల్‌ సాంగ్స్ ఎప్పటి నుంచో ఉన్నా… రీసెంట్‌ టైమ్స్‌లో మరోసారి ఈ ట్రెండ్‌ హాట్ టాపిక్ అవుతోంది. ఊ అంటావా మావ ఉఉ అంటావా అంటూ సిల్వర్‌ స్క్రీన్నే కాదు సోషల్ మీడియాను కూడా షేక్ చేసి పడేశారు స్టార్ హీరోయిన్‌ సమంత. దీంతో మాస్ సినిమాలకు మరింత హైప్ రావాలంటే స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యారు మేకర్స్.

స్పెషల్ సాంగ్‌ ట్రెండ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు పూజా హెగ్డే. టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూనే జిగేల్‌ రాణిగా మురిపించిన ఈ బ్యూటీ… రీసెంట్‌గా లైఫ్‌ అంటే ఇట్టా ఉండాలా అంటూ స్పెషల్‌ సాంగ్‌కు రేంజ్‌ను మరింత పెంచారు.

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా రామారావు ఆన్‌ డ్యూటీ. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మసాలా యాడ్ చేసేందుకు స్పెషల్ సాంగ్‌ ఇన్‌క్లూడ్ చేసింది టీమ్‌. బాలీవుడ్ బ్యూటీ అన్వేషీ జైన్‌పై తెరకెక్కించిన నా పేరు సీసా అనే సాంగ్ ఇప్పుడు ఆన్‌ లైన్‌లో ట్రెండిగ్‌లో ఉంది.

నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజికవర్గం సినిమాలోనూ ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది. గతంలో సింగం సినిమాలో ఐటమ్ సాంగ్‌ చేసిన అంజలి.. నితిన్ సినిమాలోనూ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడారు. రా రా రెడ్డి.. ఐయామ్ రెడీ అంటూ సినిమా మీద మాస్ ఆడియన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.

మెగా మూవీ గాడ్‌ ఫాదర్‌లోనూ ఓ స్పెషల్‌ సాంగ్‌కు స్కోప్‌ ఉంది. లూసీఫర్ సినిమా క్లైమాక్స్‌ ఓ పబ్‌ సాంగ్ నేపథ్యంలో సాగుతుంది. తెలుగు వర్షన్‌లోనూ ఆ సాంగ్ ఉంటుందా..? ఉంటే ఎవరు చేస్తారు? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రీసెంట్‌గా ఆచార్య కోసం రెజీనాతో స్పెషల్‌ సాంగ్ చేయించిన మెగా టీమ్‌.. ఈ సారి ఎవరిని బరిలో దించుతారో చూడాలి మరి.