Mahesh Babu: మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ షూరూ అయ్యేది అప్పుడే..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు.

Mahesh Babu: మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ షూరూ అయ్యేది అప్పుడే..
Ssmb28
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 09, 2022 | 1:09 PM

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)నటించిన సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. ఇప్పుడు మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న SSMB 28. దాదాపు 11 ఏళ్లతర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్ -మహేష్ కాంబోలో రానున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మహేష్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం అవ్వనుంది. ఈ సందర్భంగా ప్రచార చిత్రంను విడుదల చేసారు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ చిత్రం యూనిట్.

జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ సినిమాతో మరోసారి బుట్టబొమ్మ పూజాహెగ్డే మహేష్ తో జతకట్టనుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభించి వచ్చే ఏడాది (2023) వేసవిలో చిత్రం విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ  తెలిపారు. ఇక ఈ సినిమాతో మహేష్- తివిక్రమ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు సూపర్ స్టార్ మహేష్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే