Ponniyin Selvan: మణిరత్నం పొన్నియన్ సెల్వన్ కోసం రంగంలోకి లోకనాయకుడు

సినిమా ఇండస్ట్రీలో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు మణిరత్నం. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎలా ఉన్నపటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి.

Ponniyin Selvan: మణిరత్నం పొన్నియన్ సెల్వన్ కోసం రంగంలోకి లోకనాయకుడు
Kamal Haasan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 09, 2022 | 11:57 AM

Ponniyin Selvan: సినిమా ఇండస్ట్రీలో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు మణిరత్నం. ఆయన తెరకెక్కించే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నపటికీ అవి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన మణిరత్నం తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలిసారి మణిరత్నం తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan). చాలా కాలం తర్వాత మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాకోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా హిస్టారికల్ ఎపిక్ మూవీగా వస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మణిరత్నం.

ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్, ట్విట్టర్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పొన్నియన్ సెల్వన్ సినిమాకోసం లోకనాయకుడు కమల్ హాసన్ రంగంలోకి దిగారు. పొన్నియన్ సెల్వన్ తమిళ్ వర్షన్ కు కమల్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అలాగే ఒక్కొక్క భాషల్లో ఒక్కో స్టార్ హీరో ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. మణిరత్నం, కమల్ హాసన్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. మణిరత్నం తెరకెక్కించిన నాయకుడు సినిమా నుంచి వీరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహంతోనే పొన్నియన్ సెల్వన్ తమిళ్ వర్షన్ ను కమల్ వాయిస్ ఇవ్వాలని మణిరత్నం కోరారట. ఇక కమల్ హాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో తన విశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే