AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: కోనసీమ జిల్లాలో విచిత్రం.. జోరు వర్షంలో భూమి నుంచి వేడి గాలులు.. అధికారులు ఏం చెప్పారంటే..?

కోనసీమ జిల్లాలో ఓ విచిత్ర ఘటన ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్‌గా మారింది. జోరు వానలు పడుతున్న క్రమంలో.. ఓ ఇంటిలోని పెరట్లోని భూమి వేడెక్కింది. అంతేకాదు లోపలి నుంచి పొగలు వస్తున్నాయి.

AP: కోనసీమ జిల్లాలో విచిత్రం.. జోరు వర్షంలో భూమి నుంచి వేడి గాలులు.. అధికారులు ఏం చెప్పారంటే..?
Smoke From Earth
Ram Naramaneni
|

Updated on: Jul 13, 2022 | 2:38 PM

Share

Konaseema District: కోనసీమ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భూమి లోపల నుంచి పొగలు ఉబికి వస్తాయి. ఈ విడ్డూరం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. లోపల అగ్నిపర్వతం ఏమైనా ఉందా.. లేక ఇంకేమైనా ఉహకందని వింత ఏమైనా జరగబోతోందా? అన్న అనుమానాలు స్థానికులను ఉక్కిరి బిక్కిరి చేశాయి.  కోనసీమ జిల్లా ఐ.పోలవరం(I Polavaram) మండలం టి.కొత్తపల్లి(T Kothapalli )లో ఈ ఘటన చోటు చేసుకుంది. గోపాలరాజు అనే వ్యక్తి ఇంటి పెరటిలోని భూమి ఒక్కసారిగా వేడెక్కింది. భూమి లోపల ఎవరైనా మంటపెట్టారా.. అని డౌట్ వచ్చేంతలా పొగలు వస్తున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. జోరు వానలు.. మూడు రోజుల నుంచి ముసురు పట్టి ఉంది. వాతావరణం అంతా చల్లగా మారింది. మూడు రోజుల నుంచి సూర్యుడు కూడా కనిపించడం లేదు. కానీ ఇక్కడ మాత్రం పొగలు కక్కుతోంది. అగ్నిపర్వతంలో నుంచి వేడిబయటకు వచ్చినట్టు.. పెరటిలో నుంచి పొగలు కక్కుతున్నాయి. బురద మట్టి కూడా వేడిగానే ఉండటమే.. ఇక్కడ అర్ధం కాని మిస్టరీ.

పొగలు కక్కుతున్న ప్రాంతంలో వర్షపు నీరు.. పడినవి పడినట్టే ఆవిరై ఇంకిపోతున్నాయి. ఆ ప్రాంతంలో ఒకచోట గుంటతవ్వి కొన్ని నీళ్లు పోస్తే.. అవి క్షణాల్లోనే వేడెక్కిపోతున్నాయి. గ్యాస్ మీద కాచినా.. హీటర్‌తో వేడి చేసినా కనీసం పది 15 నిముషాలు టైం పడుతుంది. కానీ ఇక్కడ ఒక్క నిముషంలోనే నీళ్లు సలసలా కాగిపోతున్నాయి. ఈ విచిత్రం ఏంటో అర్ధం కాక చుట్టు పక్కల వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. జాయింట్ కలెక్టర్‌తో పాటు, ఓఎన్‌జీసీ అధికారులు సంఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఏమి లేవని నిర్దారించారు. భూమి పొరల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఇలా జరిగి ఉందొచ్చని పర్యావరణ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఆ మట్టిని టెస్ట్ కోసం ల్యాబ్‌కు పంపించారు. ఈ ఘటనకు కారణం ఏంటనేది త్వరలోనే కనిపెడతామని అధికారులు చెప్తున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్థానికులకు భరోసా ఇస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..