Kids Health tips: ఎదిగే పిల్లల్లో నులిపురుగుల సమస్యకు చక్కటి వైద్యం.. ఇంట్లోని పదార్థాలే మందు..

ఎదిగే పిల్లలకు ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి రోజూ వారికి పెట్టే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో ఉండే పదార్థాల ద్వారా కూడా ఈ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.

Kids Health tips: ఎదిగే పిల్లల్లో నులిపురుగుల సమస్యకు చక్కటి వైద్యం.. ఇంట్లోని పదార్థాలే మందు..
Kids Health Tips
Follow us

|

Updated on: Jul 20, 2022 | 8:22 PM

Kids Health tips: పిల్లల శారీరక ఎదుగుదల సక్రమంగా జరగకపోతే దానికి కారణం … కడుపులో నులిపురుగులే.. ఎదిగే పిల్లలకు ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి రోజూ వారికి పెట్టే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో ఉండే పదార్థాల ద్వారా కూడా ఈ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

కొబ్బరినూనె: సహజ ప్రయోజనాలతో కూడిన కొబ్బరి నూనె కడుపులో ఉన్న నులి పురుగులను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కడుపులో పురుగుల సమస్య ఉందని తెలిసిన వెంటనే… ఇక మీ పిల్లలకు ప్రతిరోజూ కొబ్బరినూనెతో చేసిన ఆరోగ్యకరమైన పదార్థాలు లేదా ఆహారాన్ని తినిపించడం చెయ్యండి. ఇక ఇలా చేయడం వల్ల అది ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రుచికరంగా కూడా మారుతుంది. పిల్లల కడుపులో పురుగులు లేకపోయినా కూడా ఈ నూనెతో చేసిన వంటకాలు తినిపించడం ద్వారా వారిని మరింత ఆరోగ్యవంతులుగా తయారు చెయ్యొచ్చు.

పసుపు: ఔషధ గుణాలు కలిగిన పసుపును పురాతన కాలం నుంచి గృహవైద్యంగా ఉపయోగిస్తున్నారు. కడుపులోని పురుగులను చంపడానికి లేదా తొలగించడానికి మజ్జిగలో పసుపు కలపండి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా వాడి చూడండి తేడా మీకే తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

కాకరకాయ: దీని పేరు వినగానే పిల్లలే కాదు.. పెద్దలు కూడా వాక్‌ అంటారు…ఇది ఎవరికీ నచ్చదు. కానీ, దీని ద్వారా కూడా పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఉప్పు నీటిలో ఒక చేదు కాకరకాయ వేసి, ఆపై బంగాళాదుంపలతో ఉడికించాలి. ఇప్పుడు మాష్ చేసి పిల్లలకు తినిపించినట్టయితే మంచి ఫలితం ఉంటుంది.

వేప: పొట్ట, చర్మం, జుట్టు సమస్యల నుంచి కాపాడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి. కడుపులో పురుగులను చంపడానికి, వేప ఆకులను ఎండబెట్టి, ఆపై దానిని పిల్లల ఆహారంలో చేర్చి తినిపించండి. 15 రోజుల పాటు ఈ విధానాన్ని అనుసరించండి. ఇక ఇలా చేస్తే కడుపులోని పురుగులు ఈజీగా తొలగిపోవడమే కాకుండా.. ఇంకా అలాగే ఇతర ఉదర సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!