- Telugu News Photo Gallery Stomach worm in kids give these foods to your child and keep him healthy in Telugu
Kids Health tips: పిల్లల ఎదుగుదలకు ప్రతిరోధకంగా నులిపురుగులు.. నివారించాలంటే ఈ ఫుడ్స్ తినిపించండి
Parenting Tips: పిల్లల శారీరక ఎదుగుదల సక్రమంగా జరగకపోతే కడుపులో నులిపురుగులు కారణం కావచ్చు. పిల్లల్లో ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే కొన్ని సూపర్ ఫుడ్స్ వారి డైట్‌లో చేర్చాలి.
Updated on: Jul 20, 2022 | 10:04 PM

పిల్లల శారీరక ఎదుగుదల సక్రమంగా జరగకపోతే కడుపులో నులిపురుగులు కారణం కావచ్చు. పిల్లల్లో ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే కొన్ని సూపర్ ఫుడ్స్ వారి డైట్‌లో చేర్చాలి.

పిల్లల కడుపులో నులిపరుగులు నివారించడానికి ఒక చెంచా కొబ్బరినూనెను అందించాలి. ప్రతిరోజూ ఇలా అందించడం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

ఔషధ గుణాలు కలిగిన పసుపును పురాతన కాలం నుంచి వైద్యంగా ఉపయోగిస్తున్నారు. కడుపులోని నులి పురుగులను చంపడానికి లేదా తొలగించడానికి, మజ్జిగలో పసుపు కలపాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు వాడితే మంచి ప్రయోజనముంటుంది.

కాకర కాయ అని పేరు వినగానే పిల్లలతో పాటు పెద్దలు ముఖం చిట్లిస్తారు. అయితే ఇది పిల్లల పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉప్పునీటిలో కాసిన్ని కాకరకాయలు వేసి ఆపై బంగాళాదుంపలతో ఉడికించాలి. వీటిని మాష్ చేసి పిల్లలకు తినిపించాలి.

పొట్ట, చర్మం, జుట్టు సమస్యల నుంచి కాపాడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి. కడుపులో పురుగులను చంపడానికి, వేప ఆకులను ఎండబెట్టి, ఆపై దానిని పిల్లల ఆహారంలో చేర్చి తినిపించండి. 15 రోజుల పాటు ఇలా చేస్తే ప్రయోజనముంటుంది.





























