- Telugu News Photo Gallery Cricket photos Pakistan player abdullah shafique big records pakistan vs sri lanka galle test telugu cricket news
Pakistan Vs Sri Lanka: 93 ఏళ్లనాటి రికార్డులు బద్దలు.. ఇలాంటి ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. అదేంటంటే?
టెస్టు క్రికెట్‌లో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అత్యధిక సేపు క్రీజులో నిలిచిన ఆటగాడిగా అసద్ షఫీక్ నిలిచాడు. శ్రీలంకపై షఫీక్ 8 గంటల 44 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు.
Updated on: Jul 20, 2022 | 8:35 PM

గాలే టెస్టులో పాకిస్థాన్ అద్భుతం చేసింది. శ్రీలంక నిర్దేశించిన 343 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్ 6 వికెట్లు కోల్పోయి సాధించింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ అజేయంగా 160 పరుగులు చేసి పాక్ విజయంలో హీరోగా నిలిచాడు. పాకిస్థాన్ సాధించిన ఈ విజయం చారిత్రాత్మకమే కాదు షఫీక్ చరిత్ర పుటల్లో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు. షఫీక్ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆడిన ఇన్నింగ్స్ ఆడాడు.

టెస్టు క్రికెట్‌లో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అత్యధిక సేపు క్రీజులో నిలిచిన ఆటగాడిగా అసద్ షఫీక్ నిలిచాడు. శ్రీలంకపై షఫీక్ 8 గంటల 44 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. జింబాబ్వేపై 7 గంటల 40 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన అరవింద డి సిల్వా పేరిట ఈ రికార్డు అంతకుముందు ఉంది.

టెస్టు మ్యాచ్‌లో నాల్గవ ఇన్నింగ్స్‌లో 400 కంటే ఎక్కువ బంతులు ఆడిన ఐదవ బ్యాట్స్‌మెన్ అబ్దుల్లా షఫీక్. అతని కంటే ముందు హెర్బర్ట్ సట్‌క్లిఫ్, సునీల్ గవాస్కర్, మైక్ అథర్టన్, బాబర్ ఆజం ఈ ఘనత సాధించారు.

లక్ష్యాన్ని ఛేదించే సమయంలో 400 బంతులు ఆడి జట్టును విజయతీరాలకు చేర్చిన టెస్టు క్రికెట్‌లో రెండో బ్యాట్స్‌మెన్‌గా అబ్దుల్లా షఫీక్ నిలిచాడు. అంతకుముందు 1929లో అంటే 93 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాపై హెర్బర్ట్ సచ్‌క్లిఫ్ ఈ ఘనత సాధించాడు.





























