Hyderabad Metro Rail: మెట్రో స్టేషన్‌లో కాదు.. ఏకంగా రన్నింగ్‌ ట్రైన్‌లోనే ఇరగదీసింది.!

మెట్రో ట్రైన్‌లో ఎవరి పనులపై వాళ్లు సీరియస్‌గా జర్నీ చేస్తుంటే ఓ అమ్మాయి ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయడం చూసి షాక్‌ అవుతున్నారు ప్యాసింజర్లు. ఇక ఈ యువతీ డ్యాన్స్‌పై తెగ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. అక్కా మళ్లీ వచ్చావా...?

Hyderabad Metro Rail: మెట్రో స్టేషన్‌లో కాదు.. ఏకంగా రన్నింగ్‌ ట్రైన్‌లోనే ఇరగదీసింది.!
Hyderabad Metro Rai
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 20, 2022 | 6:12 PM

Hyderabad Metro Rail: సోషల్ మీడియోలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. సోషల్ మీడియా వచ్చాక యువత ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతుంది. యువతీయువకులు రీల్స్, ఫ్రాంక్స్, టిక్ టాక్ అంటూ నిత్యం వీడియోలు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫేమస్ అవుతున్నారు. అయితే,తాజాగా హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో ఓ యువతి చేసిన డాన్స్ వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది. ప్రస్తుతం ఆ యువతి డాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లోని ఆ మెట్రో స్టేషన్‌ ఎక్కడో తెలియదుగానీ, యువతి మాత్రం తన డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. అయితే,సదరు యువతికి సంబంధించిన మరో వీడియో కూడానెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సారి మెట్రో స్టేషన్‌లోనే కాకుండా మెట్రో రైల్‌లో కూడా యువతి అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. జీన్స్, స్లీవ్ లెస్ టాప్ ధ‌రించిన యువ‌తి.. కన్నడ సినిమా విక్రాంత్ రోనా సినిమాలోని ‘రారా రక్కమ్మ.. రారా రక్కమ్మ’ అనే పాట‌కు స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో స్టెప్పులు వేసింది. మ‌రో పాట‌కు క‌దులుతున్న రైల్లోనే స్టెప్పులేసి అంద‌ర్నీ మైమ‌రిపించింది. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. అవి కాస్త వైరల్‌గా మారాయి.

హైదరాబాద్‌ మెట్రోస్టేషన్‌లో డ్యాన్స్‌ చేసిన యువతికి సంబంధించిన మరో వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ రైల్వే స్టేషన్‌లో యువతీ డ్యాన్స్‌ చేయడంపై ఇప్పటికే మండిపడ్డారు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు. అయితే ఈ ఘటన జరిగిన కాసేపటికే ఆ యువతికి సంబంధించిన మరో డ్యాన్స్‌ వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా రన్నింగ్‌ ట్రైన్‌లోనే ఈ డ్యాన్స్‌ చేసింది సదరు యువతి. ఈ యువతి ఎవరో తెలియదు కానీ.. మోడ్రన్‌ డ్రెస్‌లో రన్నింగ్‌లో ఉన్న మెట్రో రైల్‌లో డ్యాన్స్ చేసింది. మెరున్‌ కలర్ టాప్‌, చిరిగిన జీన్స్‌ వేసుకొని చూడటానికి బాగానే ఉన్న అమ్మాయి.. డ్యాన్స్‌ మాత్రం అదరగొట్టింది.

ఇక మెట్రో ట్రైన్‌లో ఎవరి పనులపై వాళ్లు సీరియస్‌గా జర్నీ చేస్తుంటే ఓ అమ్మాయి ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయడం చూసి షాక్‌ అవుతున్నారు ప్యాసింజర్లు. ఇక ఈ యువతీ డ్యాన్స్‌పై తెగ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. అక్కా మళ్లీ వచ్చావా…? అంటూ మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి