Puli Adugu Mokka: కీళ్లు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. ఈ మొక్క ఆకుల పేస్ట్ బెస్ట్ మెడిసిన్..

అడవుల్లో, బీడు, బంజరు భూముల్లో కనిపించే కొన్ని మొక్కలను పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అంటూ పట్టించుకోకుండా వాటిని తీసిపాడేస్తాం.. కానీ అలాంటి మొక్కల్లో అనేక వ్యాధులను నయం చేసే గుణాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. 

Puli Adugu Mokka: కీళ్లు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. ఈ మొక్క ఆకుల పేస్ట్ బెస్ట్ మెడిసిన్..
Tiger Foot Creeper
Follow us
Surya Kala

|

Updated on: Jul 21, 2022 | 5:07 PM

Puli Adugu Mokka: ప్రకృతి మనిషికి ఇచ్చిన వరం మొక్కలు. ప్రకృతిలో లభించే మొక్కల్లోనే మనిషి వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలను ఇచ్చాడు భగవంతుడు. ప్రకృతికి దగ్గర జీవించే మనిషికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఏ సీజన్ లో దొరికే పండ్లు, కూరగాయలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటామన్న సంగతి తెలిసిందే. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి. అడవుల్లో, బీడు, బంజరు భూముల్లో కనిపించే కొన్ని మొక్కలను పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అంటూ పట్టించుకోకుండా వాటిని తీసిపాడేస్తాం.. కానీ అలాంటి మొక్కల్లో అనేక వ్యాధులను నయం చేసే గుణాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది.  అలాంటి మొక్క‌ల్లో పులి పంజా మొక్క కూడా ఒక‌టి. ఇది చూడడానికి పులి అడుగు లా ఉంటుంది కనుక దీనిని పులి అడుగు మొక్క అని కూడా అంటారు. ఇది ఓ తీగ జాతి మొక్క.. చెట్లకు అల్లుకుని పెరుగుతుంది. దీనిని ఇంగ్లీష్ లో టైగ‌ర్ ఫుట్ (Tiger foot Creeper), టైగ‌ర్ పా అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉపయోగించే ఈ పులి అడుగు మొక్క ఆరోగ్యానికిచేసే మేలు గురించి తెలుసుకుందాం..

గామీణ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించేవారు ఈ మొక్కను ఎక్కువగా తేలు, పాము వంటి విష జంతువులు కరిచినప్పుడు ఔషధంగా ఉపయోగిస్తారు. కాటు వేసిన ప్రాంతంలో ఈ మొక్క ఆకుల పేస్ట్ ను వేసి.. కట్టుకడితే విషం హరిస్తుంది.

కుక్క కరిచినప్పుడు కూడా ఈ మొక్క ఔషధంగా ఉపయోగిస్తారు. ఆకులు, పువ్వులు, కాడలను కలిపి మొత్తగా నూరి.. రసం తీసి.. ఆ రసాన్ని బాధితుడితో తాగించేవారు. ఇలా చేయడం వలన కుక్క కాటు విషం హరిస్తుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

ఫైల్స్ లో ఇబ్బంది పడే వారికీ ఈ మొక్క దివ్య ఔషధం.. ఈ మొక్క ఆకుల పేస్టుని మొలలపై రాయడం వలన సమస్య క్రమంగా అదుపులోకి వస్తుంది.

కీళ్ల నొప్పు, మోకాలి నొప్పులతో ఇబ్బందిపడేవారికి కూడా ఈ పులి పంజా ఆకుల పేస్ట్ మంచి మెడిసిన్.. ఈ ఆకుల పేస్టుని నొప్పులున్న ప్లేస్ లో వేసి.. కట్టుకడితే.. నొప్పులు తగ్గుతాయి.

సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడేవారికి పులి పంజా ఆకు నివారణ ఇస్తుంది. ఈ ఆకుల పేస్టుని శారీరానికి అప్లై చేసి.. కొంచెం సేపటి తర్వాత.. గోరు వెచ్చటి నీరుతో స్నానం చేయడం వలన ఉపశమనం లభిస్తుంది.

శరీరంమీద గాయాలు, పుండ్లు, తామర వంటి వాటితో బాధపడేవారు.. ఈ ఆకుల పేస్ట్ మంచి మెడిసిన్. అంతేకాదు ముఖం మీద మొటిమలను కూడా తగ్గించి.. మంచి నిగారింపునిస్తుంది. పులి అడుగు ఆకుల పేస్ట్.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉన్నా.. వీటిని ఉపయోగించాలన్నా ముందుగా సమీపంలోని వైద్య నిపుణులను ;లేదా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..