Jamun Leaves Benefits: కిడ్నీల్లో రాళ్ల సమస్యలకు నేరేడు ఆకులు దివ్య ఔషధం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
నేరేడు పండ్లు, ఆకులే కాకుండా నేరేడు చెట్టు బెరడు, గింజలు, వేర్లు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తారు.
Jamun Leaves Benefits: ప్రకృతి సిద్ధంగా లభించే సీజనల్ ఫ్రూట్స్, ఆహారపదార్థాలను తీసుకుంటే చాలు ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాంటి సీజనల్ పండ్లలో ఒకటి నేరేడు. ఆకర్షణీయమైన రంగులో అందమైన ఈ పండు పోషకాల గని. సీతారాములు పద్నాలుగేళ్ళు వనవాసం కాలంలో ఎక్కువ భాగం ఈ నేరేడు పండుతోనే గడిపారని భారతీయుల విశ్వాసం. అందుకనే మనదేశంలో వివిధ ప్రాంతాల్లో నేరేడు పండుని దేవతా ఫలంగా భావిస్తారు. నేరేడు పండు తక్షణ శక్తి నందించడమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. కేవలం నేరేడు పండ్లు, ఆకులే కాకుండా నేరేడు చెట్టు బెరడు, గింజలు, వేర్లు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తారు. నేరేడు ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా అందిస్తారు. ఈరోజు నేరేడు ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
*నేరేడు ఆకుల్లో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం వ్యాధి బారిన పడకుండా చేస్తాయి. *మధుమేహ వ్యాధి గ్రస్తులకు నేరేడు ఆకులు మంచి ఔషధం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. *నేరేడు ఆకులు మలబద్దకాన్ని, అలర్జీలను తగ్గిస్తాయి. *చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి నేరేడు ఆకులు చక్కటి పరిష్కారం. నేరేడు ఆకుల రసాన్ని నోట్లోవేసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా చేయడం వలన దంత సమస్యలు తగ్గుతాయి. *అరి కాళ్ళు, అరి చేతులు మంటలు వేస్తుంటే.. నేరేడు ఆకుల రసంలో తేనెను కలిపి తాగడం మంచి ఫలితం ఉంటుంది. *క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో కూడా నేరేడు ఆకులు ఉపయోగపడతాయి. *అల్సర్లను తగ్గించే గుణం కూడా ఈ నేరేడు ఆకుల సొంతం. *ఈ ఆకుల నుండి తీసిన నూనెను పర్ ఫ్యూమ్స్, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. *కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారికీ దివ్య ఔషధం నేరేడు ఆకులు. ముందుగా 10 నుండి 15 గ్రాముల నేరేడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటికి 4 నల్ల మిరియాలు కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో వేసుకుని జ్యూస్ గా చేసుకుని రోజు తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
*కణితులను నివారించడం ఈ ఆకు మంచి ప్రయోజనకారి. శరీరంలో కణితులు పెరగకుండా లేదా అభివృద్ధి చెందకుండా నిరోధించే సహజ లక్షణాలు ఉన్నాయి.
*సాధారణంగా, మీకు 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ జ్వరం ఉంటే నేరేడు ఆకులను ఔషధంగా ఉపయోగపడతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించే ముందు ఆరోగ్య నిపుణుల సలహాలను సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది)