Corn Silk Tea Benefits: మొక్క జొన్న పీచుతో టీ చేసుకోవడం ఎలా? దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఎవరైనా సరే.. మొక్క‌జొన్న కంకుల‌ను తిని వాటి పీచును వ్యర్థం అంటూ ప‌డేస్తూ ఉంటారు. ఈ పీచు మృదువుగా చూడ‌డానికి మెరుస్తూ ఉంటుంది. దీనిని జొన్న‌ ప‌ట్టు అంటారు. ఈ మొక్కజొన్న పొట్టమీద ఉండే పీచులో అనేక ఔషధగుణాలు ఉన్నాయి.

Corn Silk Tea Benefits: మొక్క జొన్న పీచుతో టీ చేసుకోవడం ఎలా? దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Corn Silk Tea
Follow us
Surya Kala

|

Updated on: Jul 08, 2022 | 4:04 PM

Corn Silk Tea Health Benefits: మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో మొక్క‌జొన్న కూడా ఒక‌టి. తక్కువ ధరలో లభిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వేడివేడిగా మొక్క జొన్న పొత్తులను తినడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తారు. మొక్క‌జొన్న‌ పొత్తులను కాల్చుకుని, ఉడికించుకుని తింటారు.  మొక్కజొన్న గింజలతో పేలాల‌ను, పాప్ కార్న్ ను, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని త‌యారు చేస్తారు. అనేక రకాలుగా ఆహారపదార్ధాల తయారు చేసుకుని తింటారు. అయితే ఎవరైనా సరే.. మొక్క‌జొన్న కంకుల‌ను తిని వాటి పీచును వ్యర్థం అంటూ ప‌డేస్తూ ఉంటారు. ఈ పీచు మృదువుగా చూడ‌డానికి మెరుస్తూ ఉంటుంది. దీనిని జొన్న‌ ప‌ట్టు అంటారు. ఈ మొక్కజొన్న పొట్టమీద ఉండే పీచులో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. ఈరోజు మొక్క జొన్న పీచుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, కార్న్ సిల్క్ నీటి తయారీ గురించి తెలుసుకుందాం..

మొక్కజొన్న కండి మీద ఉండే పీచు ( కార్న్ సిల్క్ ) ని వివిధ దేశాల‌లో సంప్రదాయ వైద్యంలో  ఉప‌యోగిస్తున్నారు. అనేక వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు , మూత్రాశయ ఇన్ఫెక్షన్‌లు, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ వాపు వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ కార్న్ సిల్క్ రక్తప్రసరణ లోపాలు, గుండె వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు, అలసట, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగిస్తారు. ఈ కార్న్ సిల్క్ నీటిని రోజూ తాగడం వలన కిడ్నీ పని తీరు మెరుగుపడుతుంది.

మొక్కజొన్న కంకుల లాగా ఈ ప‌ట్టు కూడా విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో మొక్కజొన్న ప‌ట్టుతో టీ తాగ‌డం వలన శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శక్తి పెరుగుతుంది. ముఖ్యమైన అవ‌యవాల ప‌నితీరు కూడా మెరుగుప‌డుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ ను తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

ఇవి కూడా చదవండి

ఈ టీని తాగ‌డం వల్ల ర‌క్తపోటు, షుగ‌ర్ వంటి వ్యాధులు నియంత్రణ‌లో ఉంటాయి. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించి బ‌రువును త‌గ్గించ‌డంలో కూడా ఈ టీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ టీలో కొద్దిగా నిమ్మర‌సాన్ని క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

మొక్కజొన్న ప‌ట్టుతో చేసే టీ ని తాగ‌డం వ‌ల్ల అజీర్తి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. జీర్ణవ్యవ‌స్థ మెరుగుప‌డి మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. అంతే కాకుండా ప్రస‌వానంత‌రం స్త్రీలు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ర‌క్తస్రావం అధికంగా అవ‌కుండా ఉంటుంది.

ఈ టీ ని ప్రతిరోజూ తాగుతూ ఉండ‌డం వ‌ల్ల ప్రోస్టేట్ గ్రంథి వాపు త‌గ్గుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కార్న్ సిల్క్ టీ తయారీ : మొక్కజొన్న పీచుని తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసుకుని మరిగించాలి. బాగా మరిగిన నీటిలో నిమ్మరసం వేసుకుని.. వేడివేడిగా తాగాలి. ఇలా రోజుకి రెండు సార్లు తాగడం వలన శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి.

ఈ టీ ని చిన్న పిల్లలు, గ‌ర్భిణీలు, ఇత‌ర వ్యాధుల‌కు మందులు వాడే వారు మాత్రం తాగ‌రాదు. అలాగే రాత్రి ప‌డుకునే ముందు కూడా ఈ టీ ని తాగ‌రాద‌ని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించే ముందు ఆరోగ్య నిపుణుల సలహాలను సూచనలు తీసుకోవడం మంచిది.)

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే