Arvind Goyal Donate Property: డాక్టర్ ఔదార్యం..పేద పిల్లల కోసం రూ.600 కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చాడు..
ఓ వైద్యుడిగా వేలాది మందికి ఉచిత వైద్యం అందించాడు. లాక్‌డౌన్ కష్టలు పడుతున్న పేదలకు రకాల వసతులు ఏర్పాటు చేసి ఎందరికో అండగా నిలబడ్డారు..గత 50సంవత్సరాలుగా వైద్యవృత్తితో పేద ప్రజలకు సేవచేస్తున్నారు.
Doctor Donate Property: పేదలను ఆదుకునేందుకు ఓ డాక్టర్ ఎవరూ చేయని ఒక గొప్ప పనిచేశాడు. పేద పిల్లల విద్య, వైద్యం కోసం తన యావదాస్థిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు. కరోనా కష్టకాలంలో తన చుట్టూ ఉన్న వాళ్లు ఇబ్బందులు పడుతుంటే అందరిలా చూస్తూ ఊరుకోలేదు అతడు. ఓ వైద్యుడిగా వేలాది మందికి ఉచిత వైద్యం అందించాడు. లాక్‌డౌన్ కష్టలు పడుతున్న పేదలకు రకాల వసతులు ఏర్పాటు చేసి ఎందరికో అండగా నిలబడ్డారు యూపీకి చెందిన డాక్టర్ అర్వింద్ గోయల్. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన డాక్టర్ అర్వింద్ గోయల్ గత 50సంవత్సరాలుగా వైద్యవృత్తితో పేద ప్రజలకు సేవచేస్తున్నారు. తన వైద్యం ద్వారా పేరుతోపాటు ఆస్తిపాస్తులు బాగానే కూడబెట్టుకున్నారు. కాగా, ఇప్పుడు వయసు మీదపడటంతో సుమారు రూ.600 కోట్ల విలువ చేసే తన ఆస్తినంతటిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాసిచ్చారు. 25 ఏండ్ల కిందే ఈ నిర్ణయం తీసుకున్నానని డాక్టర్ గోయల్ చెప్పారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో మొరదాబాద్ పరిధిలోని 50 గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా అన్ని రకాల వసతులు కల్పించారు. ఉచిత విద్యను అందించడంతోపాటు రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించారు. తన సేవలకుగాను నలుగురు రాష్ట్రపతుల చేతులమీదుగా పలు పురస్కారాలు అందుకున్నారు. అర్వింద్ గోయల్ భార్య రేణు గోయల్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి