Viral Video: ప్రకృతి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అట్లుంటది మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ప్రకృతి మాత తనలో కలుపుతున్న వ్యర్దాలను తిరిగి ప్రజలకు తిరిగి ఇచ్చినట్లు అనిపిస్తోంది. “సముద్రం, అడవి, చెట్లతో ప్రకృతితో ఎప్పుడూ చెలగాటమాడకండి. ప్రకృతి ఎల్లప్పుడూ తగిన సమాధానం ఇస్తుంది.
Viral Video: మనం ఎవరికీ ఏది ఇస్తే.. అదే తిరిగి మనకు దక్కుతుంది.. అది ప్రకృతి అయినా మనం చేసిన కర్మలు అయినా తిరిగి మన దగ్గరమే వస్తాయి.. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఓ వీడియో. వ్యర్ధాలు ఎక్కడబడితే అక్కడ పడేయడం వలన కలిగే అనర్ధాల గురించి ప్రజలకు ప్రకృతి ప్రేమికులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.. ముఖ్యంగా సముద్రంలో వ్యర్థాలను విసిరేస్తే కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ప్రకృతి మాత తనలో కలుపుతున్న వ్యర్దాలను తిరిగి ప్రజలకు తిరిగి ఇచ్చినట్లు అనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
ముంబైలోని మహిమ్ బీచ్‌లో భారీ చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలు ఒడ్డున కొట్టుకువచ్చిన దృశ్యాలను చూపిస్తున్న షాకింగ్ వీడియో ట్విట్టర్‌లో దర్శనమిచ్చింది. ఈ వీడియోను ముంబై మ్యాటర్స్ అనే పేజీలో షేర్ చేసారు. “ముంబైలోని బీచ్‌లు ఇప్పుడు పర్యాటకుల కోసం ఇపుడు పూర్తి స్తాయిలో తెరిచారు. అయితే అరేబియా సముద్రం నుండి వచ్చే రిటర్న్‌గిఫ్ట్‌ని చూడటానికి పౌరులు మాహిమ్ బీచ్‌కి తరలివస్తారని క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేశారు.
Citizens throng Mahim beach to have a look at the #ReturnGift from ArabianSea..#PlasticPollution#MumbaiRains pic.twitter.com/1JUmIpWof2
— मुंबई Matters™✳️ (@mumbaimatterz) July 16, 2022
ముంబయి పౌర సంఘం BMC ట్వీట్‌కు బదులిస్తూ, సముద్రంలో విసిరిన చెత్త తిరిగి తీరానికి చేరుతుంది. అంతేకాదు.. మనం విసిరే వ్యర్ధాల వలన సముద్రంలో నివసించే జీవులకు కూడా హాని అంటూ..శుభ్రం చేసిన బీచ్ చిత్రాలను జత చేసింది.. సముద్రంలో చెత్త వేయవద్దని ప్రజలను అభ్యర్థించింది.
Sir, As u mentioned # Return gift its true . Citizens shall avoid throwing waste in drains & rivers which ends up un sea.BMC regularly cleaning daily throughout day all time.
Pls see attached herewith photo. pic.twitter.com/Z9BxJ5NwKO
— WARD GN BMC (@mybmcWardGN) July 17, 2022
ప్రకృతి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది నిజం.. కనుక ఇక నుంచైనా ప్రజలు డ్రెయిన్లు , నదులలో వ్యర్థాలను విసిరేయడం మానుకోవాలి.. ఎందుకంటే ఇక్కడ వేసే చెత్త.. సముద్రంలోకి చేరుతుంది.. ఇప్పటికే బీచ్ ను BMC రోజూ రోజంతా శుభ్రం చేస్తుందని కోరుతున్నారు.
10 సెకన్ల క్లిప్‌లో ముంబై బీచ్ టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయింది. ఈ బీచ్‌లో ప్రజలు నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో భారీ గా లైక్స్, వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సమస్యపై తమ అభిప్రాయాలను నెటిజన్ల కామెంట్స్ రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు.
Nature warns first, when it has no effect, it will react. Let’s not wait for that reaction, because we may not be able to bear that.
— GK Pillai (@pillaigkp) July 16, 2022
“ప్రకృతి మొదట హెచ్చరిస్తుంది.. ఆ హెచ్చరికను పట్టించుకోనప్పుడు.. అది ప్రతిస్పందిస్తుంది. ఆ రియాక్షన్ కోసం వేచి ఉండకూడాదు.. ఎందుకంటే ప్రకృతి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ను మనిషి భరించలేకపోవచ్చు” అని ఒక ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు.
Oh God! It seems all will die but plastic will only survive on this planet earth !
— smart shilpa jayesh (@JayeshShilpa) July 17, 2022
“ఓ దేవుడా.. భూమి మీద అందరూ చనిపోతారు.. కానీ ప్లాస్టిక్ మాత్రమే భూమిపై మనుగడ సాగిస్తుందనిపిస్తుందని మరొక నెటిజన్ స్పందించారు. “సముద్రం, అడవి, చెట్లతో ప్రకృతితో ఎప్పుడూ చెలగాటమాడకండి. ప్రకృతి ఎల్లప్పుడూ తగిన సమాధానం ఇస్తుంది.
Never mess with nature the sea , the forest, trees . The nature always gives a fitting reply . Sea never keeps any dirt in it. It also always throw away the dead.
— Rolland Richard Mathews (@mathews_rolland) July 16, 2022
సముద్రం ఎప్పుడూ తనలో మురికిని దాచుకోదు.. ఇది ఎల్లప్పుడూ తనలోని వ్యర్ధాలను తిరిగి భూమి మీదకు చేరుస్తుంది అని మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..