Dudh Sagar Waterfall: చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఆ సీన్‌ ఇక్కడే తీశారు..!  వీడియో చూస్తే మైమరచిపోతారు..

ఇక  ఈ జలపాతం పారుతున్న కొండల మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది. ట్రెయిన్ వెళ్తున్నప్పుడు కూడా జలపాతం దృశ్యాలు చూసి ఎంజాయ్ చేయొచ్చు. షారుఖ్, దీపికా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో..

Dudh Sagar Waterfall: చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఆ సీన్‌ ఇక్కడే తీశారు..!  వీడియో చూస్తే మైమరచిపోతారు..
Dudhsagar Falls
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 21, 2022 | 3:21 PM

Dudh Sagar Waterfall: దూద్ సాగర్ జలపాతం. దీని పేరు మీరు వినే ఉంటారు. ఆ జలపాతాన్ని ఫోటోల్లో చూడటం.. వీడియోల్లో చూడటం కాదు.. అక్కడికి వెళ్లి ఆస్వాదిస్తే తెలుస్తుంది. పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీళ్లు.. అచ్చం పాలలా కనిపిస్తాయి. దాదాపు 310 మీటర్ల ఎత్తు ఉన్న కొండల నుంచి నీళ్లు అక్కడ జాలువారుతుంటాయి. నురగలు కక్కుకుంటూ జలజలా జారుతూ పారే నీటిని చూస్తూ మైమరిచిపోవాల్సిందే. గోవాలో ఉంది ఈ అద్భుత దూత్‌సాగర్‌ జలపాతం. వర్షాకాలంలో ఇది మరింత అద్భుతంగా కనువిందు చేస్తుంది. వర్షాకాలంలో జలపాతం పొంగిపొర్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ రమేష్‌ పాండే జలపాతం దృశ్యాలను షేర్‌ చేశారు.

గోవా, కర్ణాటక సరిహద్దు మన్ డోవి నది పైన ఉంది ఈ దూద్ సాగర్ జలపాతం. దీన్నే పాల సాగర జలపాతం అని కూడా అంటారు. అంటే.. పైనుంచి జాలువారే నీళ్లు అచ్చం పాలల్లా ఉంటాయని అర్థం. ఈ జలపాతానికి చేరుకోవాలంటే గోవా రాజధాని పనాజి నుంచి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. రైల్లో అయితే, మాడ్గావన్ రైల్వే స్టేషన్ నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అటు, బెల్గాం రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెల్గాం నుంచి రోడ్డు ద్వారా వెళ్లాలంటే 55 కిలోమీటర్ల దూరం వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

ఇక  ఈ జలపాతం పారుతున్న కొండల మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది. ట్రెయిన్ వెళ్తున్నప్పుడు కూడా దూద్ సాగర్ జలపాతాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. షారుఖ్, దీపికా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో దూద్ సాగర్ జలపాతం వద్ద ఓ సీన్ ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి