NASA: భూమి నీలం నుండి ఎరుపు రంగులోకి మారింది.. నాసా విడుదల చేసిన షాకింగ్ ఫోటో

నాసా ప్రచురించిన భూమి హీట్ మ్యాప్ 46 సంవత్సరాలలో ఇదే అత్యంత షాకింగ్‌ న్యూస్‌గా తెలిసింది. ప్రస్తుతం నాసా విడుదల చేసిన ఫోటోలో భూమి నీలం నుండి ఎరుపు రంగులోకి మారిందని చూపిస్తుంది.

NASA: భూమి నీలం నుండి ఎరుపు రంగులోకి మారింది.. నాసా విడుదల చేసిన షాకింగ్ ఫోటో
Untitled 1
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 20, 2022 | 9:38 PM

NASA: భూమి వేడెక్కుతుందని శాస్త్రవేత్తలు నిరంతరం హెచ్చరిస్తున్నారు. భూమి విపరీతంగా వేడెక్కుతున్నట్లు చూపించే చిత్రాన్ని తాజాగా నాసా విడుదల చేసింది. ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం మరియు ఆసియాలోని అనేక దేశాలలో జూన్, జూలైలలో తీవ్రమైన వేడిని నమోదవుతుంది.. ఇక్కడ ఉష్ణోగ్రత సుమారుగా 40 డిగ్రీల సెల్సియస్ దాటేస్తుంది. ఏళ్ల తరబడి రికార్డులు బ్రేక్‌ చేస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 13 జూలై 2022న తీసిన చిత్రం తూర్పు అర్ధగోళంలో చాలా వరకు ఉపరితల గాలి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినట్లు చూపిస్తుంది. నాసా ప్రచురించిన భూమి హీట్ మ్యాప్ 46 సంవత్సరాలలో ఇదే అత్యంత షాకింగ్‌ న్యూస్‌గా తెలిసింది. ప్రస్తుతం నాసా విడుదల చేసిన ఫోటోలో భూమి నీలం నుండి ఎరుపు రంగులోకి మారిందని చూపిస్తుంది.

గొడ్దార్డ్ ఎర్త్ అబ్జర్వింగ్ సిస్టమ్ (GEOS) అనేది గ్లోబల్ మోడల్ వెర్షన్‌లో కనిపించే పరిశీలనలను కలపడం ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది వాతావరణంలోని భౌతిక ప్రక్రియలను సూచించడానికి గణిత సమీకరణాలను ఉపయోగిస్తుంది. NASA గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లోని గ్లోబల్ మోడలింగ్, ఇంటిగ్రేషన్ ఆఫీస్ డైరెక్టర్ స్టీవెన్ పాసన్ తెలిపిన వివరాల మేరకు…’వేర్వేరు ప్రదేశాలలో వాతావరణ మార్పులు.. విభిన్న నమూనాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు అధిక వేడితో ఎర్రగా మారి కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాలు చల్లగా నీలం రంగులో ఉంటాయి. కానీ అధిక వేడిగా ఉండే ప్రాంతాలు మానవుడు కలిగించే కాలుష్యం కారణంగా గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలతో భూమి తన స్వరూపాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. దాంతో భూమిపై మనుగడ సమస్యత్మాకంగా మారుతోందని, జీవరాశిని నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి