Viral News: ఆషాఢ మాసంలో అద్భుతం.. కాళ్లకు పారాణితో గుడిలో అడుగులు వేసిన అమ్మవారు

ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు స్వయంగా అడుగులు వేస్తూ కదిలిన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Viral News:  ఆషాఢ మాసంలో అద్భుతం.. కాళ్లకు పారాణితో గుడిలో అడుగులు వేసిన అమ్మవారు
Miracle
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 20, 2022 | 8:58 PM

Viral News:  భారతదేశం సంస్కృతికి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. ముక్కోటి దేవతలు పూజలందుకుంటున్న పుణ్యభూమి. మన దేశంలో ఎన్నో అతి ప్రాచీన అద్భుత ఆలయాలు, ఆయా దేవతలకు ప్రత్యేకమైన పూజా విధానాలు కొనసాగుతుంటాయి. అంతేకాదు, మన దేశంలో దేవుళ్లను పూజించే భక్తులకు కూడా కొదువే లేదని చెప్పాలి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని వడోదరాలో ఓ అద్భుతం జరిగింది. ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు స్వయంగా అడుగులు వేస్తూ కదిలిన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…

గుజరాత్‌లోని వడోదర జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. జిల్లాలోని దభోయ్ తాలూకాలో గల వెరై మాతా కాలనీలో మాతాజీ ఆలయం ఉంది. ఇక్కడి ఆలయంలో అమ్మవారి పాదాల ముద్రలు కనిపించి భక్తులను షాక్‌ అయ్యేలా చేసింది. గుడిలోపల చూసిన భక్తులకు మాతాజీ పాద ముద్రలు కనిపించాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు ఆలయం కిటీకి వరకు వెళ్లినట్టుగా అడుగు జాడలు కనిపించాయి. ఎర్రటి పారాణితో వేసిన అమ్మవారి అడుగులు ప్రత్యక్షమయ్యాయి. ఉదయాన్నే గుడి తలుపులు తెరిచిన పూజారి అమ్మవారి పాద ముద్రలు చూసి చుట్టు పక్కల జనాలకు వివరించారు. దాంతో జనం భారీగా గుమిగూడారు. స్వయంగా అమ్మవారే ఇక్కడ సంచరిస్తున్నారంటూ భక్తులు విశేష పూజలు చేస్తున్నారు. ఈ విషయం చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా దవానంలా వ్యాపించింది.

ఇవి కూడా చదవండి
Miracle M

దాంతో ఆలయం వద్ద భక్తుల రద్దీ కనిపించింది. తండోపతండాలుగా వస్తున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.. అమ్మవారి పాదాలను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. దాంతో భక్తులను కంట్రోల్‌ చేయడం కూడా ఆలయ సిబ్బందికి కష్టంగానే మారింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్‌ నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?