Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gay Marriages: ఆ దేశంలో గే పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్.. నిరసనలు, అరెస్టుల మధ్యే

గే వివాహాలకు (Gay Marriages) చట్టబద్ధత లభించింది. వారికి రక్షణ కల్పించే బిల్లును అమెరికా (America) ఆమోదించింది. అబార్షన్ హక్కులను తొలగిస్తూ ఇటీవల అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అక్కడి చట్టసభ్యులు ఈ బిల్లును....

Gay Marriages: ఆ దేశంలో గే పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్.. నిరసనలు, అరెస్టుల మధ్యే
Gay Marriages
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 21, 2022 | 7:35 AM

గే వివాహాలకు (Gay Marriages) చట్టబద్ధత లభించింది. వారికి రక్షణ కల్పించే బిల్లును అమెరికా (America) ఆమోదించింది. అబార్షన్ హక్కులను తొలగిస్తూ ఇటీవల అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అక్కడి చట్టసభ్యులు ఈ బిల్లును తీసుకొచ్చారు. గే వివాహాలకు డెమోక్రాట్లు మద్దతు పలకగా కొంతమంది రిపబ్లికన్లు మాత్రం వ్యతిరేకించారు. 47 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు మద్దతివ్వడంతో 267-157 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. అయితే, బిల్లుకు సెనేట్ ఆమోదం లభించాల్సి ఉంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించాలని, ఈ బిల్లును ప్రవేశపెట్టడం అనవసరమైన చర్యగా పలువురు రిపబ్లికన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటింగ్‌కు ముందు, అనేక మంది చట్టసభ సభ్యులు సుప్రీంకోర్టు బయట అబార్షన్ తీర్పును వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు మద్ధతు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా వారిని అరెస్టు చేశారు. ఇలా అరెస్టయిన వారిలో 16 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారని క్యాపిటల్ పోలీసులు తెలిపారు.

మరోవైపు.. యూరప్ లో పెరిగిపోతున్న విపరీత ధోరణులు విపరీత పరిణామాలకు దారి తీస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా గే వివాహాలు. వీటికి పలు దేశాలు చట్టబద్ధత కల్పించడం విశేషం. – నెదర్లాండ్స్, బెల్జియం, కెనడా, స్పెయిన్‌, సౌతాఫ్రికా, నార్వే, స్వీడన్‌, అర్జెంటీనా, ఐల్యాండ్‌, పోర్చుగల్‌, డెన్మార్క్, బ్రెజిల్‌, ఇంగ్లాడ్‌ డ వెల్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌, ఉరుగ్వే, లక్సెంబర్గ్. స్కాట్లాండ్‌ తదితర దేశాల్లో గే వివాహాలు చట్టబద్ధమే. కాగా.. ఇండియాలోనూ గే పెళ్లి గతంలోనే తెరపైకి వచ్చింది. ముంబైలో ఓ తల్లి తన కుమారుడికి వరుడు కావాలని ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. అతనిని పెళ్లి చేసుకునేందుకు 73 మంది గే లు ముందుకురావడం గమనార్హం. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకంటూనే ఉన్నాయి.

కాగా.. గతేడాది హైదరాబాద్ లోనూ గే పెళ్లి జరిగింది. ఇద్దరు మగవాళ్లు, రెండు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఓ రిసార్టులో వైభవంగా వివాహం చేసుకున్నారు. తెలంగాణలో పెళ్లి చేసుకున్న మొదటి గే జంటగా వీరు రికార్డు సృష్టించారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం భారత్‌లో బాగా అరుదు. మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అలాంటి పెళ్లిళ్లు జరగలేదు. మొదటిసారిగా తెలంగాణలో ఇద్దరు పురుషులు ఇలా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..