Telangana: తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు విడుదల చేయండి.. వరదల నేపథ్యంలో కేంద్రాన్ని కోరిన తెలంగాణ సర్కారు..

Telangana: తెలంగాణలో గత వారం కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది...

Telangana: తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు విడుదల చేయండి.. వరదల నేపథ్యంలో కేంద్రాన్ని కోరిన తెలంగాణ సర్కారు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 21, 2022 | 6:15 AM

Telangana: తెలంగాణలో గత వారం కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇక గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో చాలా మంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వరదలతో జరిగిన నష్టంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక అంచనాలను రూపొంచింది కేంద్రానికి నివేధించింది. పలు శాఖల్లో సుమారు రూ. 1400 కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదికలు అందించారు.

ఈ నేపథ్యంలో తక్షణ సాయంగా రూ. 1000 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. వరద నష్టాలు ఇలా ఉన్నాయి.. వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖ కు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయితీ రాజ్ శాఖలో 449 కోట్లు., ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో రూ. 33 కోట్లు.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో రూ. 379 కోట్లు.. విద్యుత్ శాఖలో రూ. 7 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఆయా శాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికలు సిద్దం చేసి కేంద్రానికి అందచేశాయి.

అదే సందర్భంలో ఇళ్లు కూలిపోవడం ముంపునకు గురికావడంతో పాటు వారిని తరలించే క్రమంలో రూ. 25 కోట్లు, ఇంకా తదితర వరద నష్టాలు వెరసి మొత్తంగా రూ. 1400 కోట్ల మేరకు రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని అధికారులు నివేదికలు సిద్దం చేసి కేంద్రానికి పంపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..