Drunk And Driving: హైదరాబాద్‌లో మందు బాబు హల్చల్‌.. పోలీసుల ఎదుట ప్యాంట్ విప్పి హంగామా..

Hyderabad: రాత్రి అయ్యిందంటే చాలు మందు బాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగి రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్‌ చేస్తున్నారు. చట్ట ప్రకారం డ్రంక్‌ డ్రైవ్‌ తీవ్ర నేరమనే విషయం తెలిసినా రోడ్లపైకి వచ్చి...

Drunk And Driving: హైదరాబాద్‌లో మందు బాబు హల్చల్‌.. పోలీసుల ఎదుట ప్యాంట్ విప్పి హంగామా..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 21, 2022 | 6:10 AM

Hyderabad: రాత్రి అయ్యిందంటే చాలు మందు బాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగి రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్‌ చేస్తున్నారు. చట్ట ప్రకారం డ్రంక్‌ డ్రైవ్‌ తీవ్ర నేరమనే విషయం తెలిసినా రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేస్తున్నారు. తాజాగా బుధవారం రాత్రి సైదాబాద్‌లోని భారత్‌ గార్డెన్‌ ముందు ఓ వ్యక్తి రచ్చ చేశాడు. పోలీసుల ముందే ప్యాంట్‌ విప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు.

వివరాల్లోకి వెళితే డ్రంక్‌ డ్రైవ్‌ టెస్ట్‌లో భాగంగా ట్రాఫిక్‌ పోలీసులు బుధవారం రాత్రి సైదాబాద్‌లోని భారత్‌ గార్డెన్‌ ముందు డ్రంక్‌ డ్రైవ్‌ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి టూ వీలర్‌ నడిపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన సదరు వ్యక్తి పోలీసుల ఎదుటే ప్యాంట్ విప్పి హంగామా చేశాడు. మీర్‌చౌక్‌ పోలీసులు ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా మందు బాబు మాత్రం చెలరేగి పోయాడు.

దీంతో బ్యాక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం మలక్‌పేట్‌లో ఓ దివ్యాంగ యువకుడు పోలీసులకు చుక్కలు చూపించాడు. ఫుల్లుగా మద్యం సేవించి పోలీసులనే బెదిరించాడు. వారాంతాల్లో ఎక్కువగా కనిపించే మందు బాబులు ఇటీవల వీక్‌ డేస్‌లోనూ రచ్చ చేస్తుండడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..