Netflix: నెట్‌ఫ్లిక్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన యూజర్లు.. ఏకంగా 10 లక్షల మంది..

Netflix: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌కు భారీ షాక్ ‌ఇచ్చారు సబ్‌స్క్రైబర్లు. మూడు నెలల వ్యవధిలోనే దాదాపు 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను..

Netflix: నెట్‌ఫ్లిక్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన యూజర్లు.. ఏకంగా 10 లక్షల మంది..
Netflix 2
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 20, 2022 | 10:15 PM

Netflix: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌కు భారీ షాక్ ‌ఇచ్చారు సబ్‌స్క్రైబర్లు. మూడు నెలల వ్యవధిలోనే దాదాపు 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. అయితే, అనధికారికంగా మాత్రం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిందని, తర్వాతి మూడు నెలల్లో మరో 20 లక్షల మందిని కోల్పోతుందని అంచనా వేస్తున్నారు. కానీ, సంస్థ మాత్రం.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తాము 9,70,000 మంది సబ్‌స్క్రైబర్స్‌ను మాత్రమే కోల్పోయినట్లు ప్రకటించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా 222 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్న ఏకైక స్ట్రీమింగ్​సర్వీస్‌గా పేరుగాంచిన నెట్‌ఫ్లిక్స్.. క్రమక్రమంగా యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌కు దూరమవుతూ వస్తున్నారు. 2020లో 37 మిలియన్లు, 2021లో 18 మిలియన్లు పడిపోయారు. తాజాగా 10 లక్షల వరకు సబ్‌స్ర్కైబర్లు కోల్పోవడం ఆ సంస్థకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. సబ్‌స్క్రిబ్షన్ ఛార్జీలు అధికంగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. చేజారుతున్న యూజర్లను మళ్లీ తనవైపునకు తిప్పుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది నెట్‌ఫిక్స్. త్వరలోనే యాడ్ హోమ్, యాడ్ అనదర్ అనే ఆప్షన్స్ తీసుకువచ్చి.. మనీ విషయంలో యూజర్లకు కాస్త ఊరట కల్పించాలని ప్రయత్నిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..