Viral Video: లండన్‌లోని 17 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియో
London Fire Accident: సమాచారం అందిన వెంటనే దాదాపు 15 ఫైర్ ఇంజిన్లతో 125 మంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
London Fire Mishap: లండన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సిటీ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని నార్త్ వూల్‌విచ్‌లోని ఓ 17 అంతస్థుల భవనంలోని పై అంతస్థులో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే దాదాపు 15 ఫైర్ ఇంజిన్లతో 125 మంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో ఈ అగ్ని ప్రమాదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. తీవ్ర ఎండలు, వడగాల్పులతో లండన్ ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా లండన్‌లో నిత్యం పలుచోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సహజంగా ఫైర్ స్టేషన్లకు ఓ రోజులో 500 ఫోన్ కాల్స్ వచ్చేవని.. అయితే గత కొన్ని రోజులుగా ఈ సంఖ్య 2600కు పైగా ఉన్నట్లు లండన్ మేయర్ సుద్ధీఖ్ ఖాన్ మీడియాకు తెలిపారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయం తర్వాత ఈ స్థాయిలో తీవ్ర ఎండలను లండన్ ప్రజలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. బ్రిటన్‌లో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా తీవ్ర ఉక్కపోతతో తాము ఇళ్లలో ఉండలేకపోతున్నట్లు లండన్ ప్రజలు వాపోతున్నారు.
Fire in a top floor flat along Factory Road E16. The smell of smoke is so so strong Hoping everyone got out#Newham pic.twitter.com/xTH6ZK3t9M
— Stevo (@Mr_Stevo87) July 20, 2022
Fire down at the tower block near city airport in London ? pic.twitter.com/5L9nD7C9Zn
— Sophie Charlotte (@sophzcharlotte) July 20, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తలు చదవండి..