Telugu News Trending Frog eating an insect with the speed of a bullet video has gone viral on social media Telugu news
Video Viral: వేటాడటంతో చిరుతనే మించిపోయింది.. బుల్లెట్ స్పీడ్ తో కీటకాన్ని గుటుక్కుమనిపించింది.. షాకింగ్ వీడియో
ఈ విశాల ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు జీవిస్తున్నాయి. రోజూ చూసే జీవులే కాకుండా మనకు తెలియనివి, అరుదైనవి చాలానే ఉన్నాయి. ఇలాంటి జీవులను మనం ఎప్పుడో గానీ చూడలేం. కానీ వీటికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో...
ఈ విశాల ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు జీవిస్తున్నాయి. రోజూ చూసే జీవులే కాకుండా మనకు తెలియనివి, అరుదైనవి చాలానే ఉన్నాయి. ఇలాంటి జీవులను మనం ఎప్పుడో గానీ చూడలేం. కానీ వీటికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో (Social Media) తరచుగా వైరల్ (Viral) అవుతుంటాయి. వింతగా కనిపించే జీవులు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం ఓ వింత జీవికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపించే జీవి బుల్లెట్ వేగంతో కీటకాన్ని వేటాడుతుంది. తుపాకీలోంచి బుల్లెట్ వచ్చి ఎవరికో తగిలినంత వేగంగా రెప్పపాటు క్షణంలో పురుగును గుటుక్కుమనిపించింది. ఈ జీవి కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. పాదాలు ఎండిన ఆకుల్లా కనిపిస్తాయి. వీటిని మలయన్ కొమ్ముల కప్ప అంటారు. ఈ కప్పలు వర్షారణ్యాలలో ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఎండిపోయిన ఆకుల్లా కనిపించడం ద్వారా, ఎరను నివారించడంలో, వేటాడటం వాటికి సులభమవుతుంది.
ఈ వింత కప్ప వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. దీనికి మలయన్ కొమ్ముల కప్ప అని క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 10 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల 42 వేలకు పైగా వీక్షించారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత వివిధ రకాల రియాక్షన్లు ఇస్తున్నారు. ‘ప్రపంచంలో ఇలాంటి కప్పలు ఉన్నాయని నేను నమ్మలేకపోతున్నాను’ అని, ‘ఏలియన్‌లాగా’ అని సరదా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి