Viral Video: లక్ అంటే నీదే బాసూ.. బహుశా యమధర్మరాజు సెలవులో ఉన్నాడేమో..
భూమ్మీద నూకలుంటే మృత్యువు కూడా మనల్ని ఏం చేయలేదనే విషయాన్ని ఈ వీడియో (Video) రుజువు చేస్తుంది. బైక్ నడుపుతున్న ఓ యువకుడు వేగంగా వచ్చిన ట్రక్కు కింద పడి సురక్షితంగా తప్పించుకోవడంతో ఈ విషయం నిజమని అర్థమవుతుంది. సోషల్...
భూమ్మీద నూకలుంటే మృత్యువు కూడా మనల్ని ఏం చేయలేదనే విషయాన్ని ఈ వీడియో (Video) రుజువు చేస్తుంది. బైక్ నడుపుతున్న ఓ యువకుడు వేగంగా వచ్చిన ట్రక్కు కింద పడి సురక్షితంగా తప్పించుకోవడంతో ఈ విషయం నిజమని అర్థమవుతుంది. సోషల్ మీడియాలో యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో భయం కలిగించే వీడియోలతో పాటు అశ్చర్యపరిచేవి కూడా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో (Social Media) తెగ చక్కర్లు కొడుతోంది. వర్షాకాలంలో రోడ్లు తడిగా ఉండడంతో అతివేగంగా వెళ్లే వాహనాలు జారిపోతుంటాయి. ఈ వీడియోలో వర్షం కురుస్తున్న సమయంలో.. ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ చక్రం జారింది. బండిని కంట్రోల్ చేయలేక కిందపడిపోయాడు. ఇదే సమయంలో ఒక ట్రక్కు అతని వద్ద వేగంగా వస్తుంది. ఆ యువకుడు వెంటనే అప్రమత్తమై బైక్ వదిలి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రెప్పపాటు కాలంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇవి కూడా చదవండిView this post on Instagram
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు స్టన్ అయిపోయి ఆ యువకుడి అదృష్టాన్ని మెచ్చుకుంటున్నారు. అతని అదృష్టం బాగుండడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడని ఒకరు, యమ రాజు సెలవులో ఉన్నారా?’ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చావంచుల వరకూ వెళ్లొచ్చావ్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి