Brigida Saga: అతని కోసమే నగ్నంగా నటించా.. నన్ను హీరోయిన్‌ను చేసిన క్రెటిట్‌ అతనిదే : బ్రిగిడ సాగా

Brigida Saga: అతని కోసమే నగ్నంగా నటించా.. నన్ను హీరోయిన్‌ను చేసిన క్రెటిట్‌ అతనిదే : బ్రిగిడ సాగా

Anil kumar poka

|

Updated on: Jul 21, 2022 | 12:34 PM

కోలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు పార్తిబన్ (Parthiban) తాజాగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'ఇరవిన్ నిళల్'. ఈ సినిమా జూలై 15న విడుదలైంది.


కోలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు పార్తిబన్ (Parthiban) తాజాగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఇరవిన్ నిళల్’. ఈ సినిమా జూలై 15న విడుదలైంది. వరలక్ష్మి శరత్ కుమార్, రోబో శంకర్, ప్రియాంకా రుత్, బ్రిగిడ సాగా, ఆనంద కృష్ణన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా సింగిల్ షాట్‌లో చిత్రీకరించారు. అంతేకాదు, మొట్టమొదటి నాన్ లీయర్ సింగిల్ షాట్ ఫిల్మ్‌గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించిన బ్రిగిడ సాగా అనే అమ్మాయి.. నగ్నంగా నటించారు. కాగా ఇందులోని తన పాత్ర గురించి బ్రిగిడ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్న తనను ఒక హీరోయిన్‌ను చేసిన క్రెడిట్‌ పార్తీబన్‌కే దక్కుతుందన్నారు. ఆయన కోరిక మేరకే తాను ‘ఇరవిన్‌ నిళల్‌’ మూవీలో నగ్నంగా నటించానని చెప్పారు. ‘ఈ చిత్రంలో సహాయ దర్శకురాలిగా పని చేసేందుకు వెళ్ళిన తనను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశారని, సినిమాకు ఒక న్యూడ్‌ సీన్‌ అవసరమవుతుందని, అందుకు సినిమాను ప్రేమించే వారే కావాలని వారు చెప్పడంతో ఒప్పుకున్నానని చెప్పారు. ఈ పాత్ర చేయడానికి తన తల్లిదండ్రులను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డానని, ఆ తర్వాత పార్తీబన్‌ అంతా వివరించడంతో వారు ఒకే చెప్పారన్నారు. అయితే, ఈ సన్నివేశంలో అనేక టెక్నికల్‌ విషయాలున్నాయని, సినిమాలో చూస్తే మాత్రం అది నిజంగానే న్యూడ్‌ సీన్‌గా కనిపిస్తుంది’ అని వివరించారు. కాగా న్యూడ్‌ సీన్‌ను బ్రిగిడ ధైర్యంగా చేసిందంటూ అందరూ మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 21, 2022 10:03 AM