Chef Mantra: పెళ్లైన తర్వాతే వంటల్లో ఇన్ని రకాలు ఉంటాయని తెలిసింది.. సుహాస్ ఆసక్తికర కామెంట్స్
aha OTT - Chef Mantra: అచ్చమైన తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా డిజిటల్. ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది తొలి తెలుగు ఓటీటీ ఆహా.
Chef Mantra: అచ్చమైన తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (aha OTT). ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ వస్తోందీ తొలి తెలుగు ఓటీటీ. ఎప్పటికప్పుడు కొంగొత్త ఒరిజినల్స్‌ను అందిస్తూనే.. మరో వైపు ఇతర భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను తెలుగులోకి అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఈ ఆహాలో తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలు డబ్ చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆహాలో ఇప్పటివరకు సూపర్ హిట్ సినిమాలతో పాటు, ఇంట్రస్టింగ్ గేమ్ షోస్, ఆకట్టుకునే టాక్ షోలతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. అలాగే ప్రముఖ యాంకర్ శ్రీముఖి(Anchor Sreemukhi) హోస్ట్ గా వంటలకు సంబంధించిన చెఫ్ మంత్ర (Chef Mantra) షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ ఎగ్జయిటింగ్ వంటల టాక్ షో చెఫ్ మంత్ర ఆహా ఓటీటీ ప్రేక్షకుల మెప్పుపొందింది. ఇప్పుడు టీవీ 9 ఎంటర్టైన్మెంట్(TV9 Entertainment) యూట్యూబ్ ఛానల్‌లో మరోసారి ప్రసారం అవుతోంది. తాజాగా చెఫ్ మంత్ర మూడోవ ఎపిసోడ్ టీవీ9 ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం అవుతుంది. టాలెంటెడ్ హీరో సుహాస్ ఈ ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరయ్యారు. విజయవాడలో తన తిన్న రుచికరమైన వంటకాలతో పాటు తనకు తెలిసిన వంటను యాంకర్ శ్రీముఖితో కలిసి చేసి సందడి చేశారు సుహాస్. ఈ ఎపిసోడ్ ఎంతో సరదాగా సాగింది. ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ పై మీరూ ఓ లుక్కేయండి.
Chef Mantra -Episode 3