Bimbisara : క్యాథరిన్ అందాలను పొగుడుతున్న కళ్యాణ్ రామ్.. ‘బింబిసార’ నుంచి అందమైన సాంగ్ ప్రోమో

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హిస్టారికాల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. నిన్నమొన్నటివరకు, లవ్ అండ్ యాక్షన్ సినిమాలు చేస్తూ ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Bimbisara : క్యాథరిన్ అందాలను పొగుడుతున్న కళ్యాణ్ రామ్.. 'బింబిసార' నుంచి అందమైన సాంగ్ ప్రోమో
Bimbisara
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 20, 2022 | 8:57 PM

నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram)ప్రస్తుతం హిస్టారికాల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. నిన్నమొన్నటివరకు, లవ్ అండ్ యాక్షన్ సినిమాలు చేస్తూ ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే అప్పట్లో అందర్నీ పాక్‌ చేశారు. ఆతర్వాత వెంటనే బింబిసార టీజర్‌ ను రిలీజ్‌ చేసి నందమూరి ఫ్యాన్స్ ను షేక్ చేశారు. యూట్యూబ్ రచ్చ రచ్చ చేశారు. ఇక తాజగా రిలీజ్‌ చేసిన బింబిసార ట్రైలర్‌తో.. ఈ రచ్చను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లారు కళ్యాణ్ రామ్. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడుగా.. కలియుగంలో మళ్లీ తిరిగి వచ్చిన బింబిసారుడిగా.. డ్యూయల్ షేడ్‌లో ఈ ట్రైలర్లో కనిపించారు కళ్యాణ్ రామ్. నందమూరి వారికే సాధ్యమవుతాయి అనేలా.. పవర్‌ ఫుల్ డైలాగులతో ట్రైలర్ లోనే చప్పట్లు కొట్టించుకున్నారు కళ్యాణ్ రామ్.

ఇక ఈ సినిమానుంచి ఇటీవలే ఈశ్వరుడు అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజా మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఓ తేనె పలుకుల అమ్మాయి అంటూ సాగే ఈ పాట చాలా వినసొంపుగా ఉంది. హేమంత్, సత్య యామిని ఆలపించిన ఈ పాటను వారికుప్పల యాదగిరి రచించి సంగీతం అందించారు. లిరికల్ సాంగ్ ను ఈ నెల 21న, వీడియో సాంగ్ ను ఈ నెల 23న సాయంత్రం 5 గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే