Samantha Ruth Prabhu: అక్షయ్ కుమార్ తో కలిసి ‘ఊ… అంటావా మావా..’ సాంగ్ కు స్టెప్పేసిన సామ్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఏలిన బ్యూటీస్ లో సమంత పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎం మాయ చేశావే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అందాల భామ. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిసింది.

Samantha Ruth Prabhu: అక్షయ్ కుమార్ తో కలిసి 'ఊ... అంటావా మావా..' సాంగ్ కు స్టెప్పేసిన సామ్
Samantha Akshay
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 20, 2022 | 5:01 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఏలిన బ్యూటీస్ లో సమంత(Samantha Ruth Prabhu)పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఏం మాయ చేశావే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల భామ. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిసింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ భామ. ఆ తర్వాత తమిళ్ సినిమాల్లోనూ సత్తా చాటింది. అక్కడ ఇక్కడ వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. ఇక ఇటీవలే ఈ చిన్నది బాలీవుడ్ లోనూ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో సమంత ఓ వెబ్ సిరీస్ ద్వారా పరిచయం అయ్యింది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో నటించి ఆకట్టుకుంది సమంత. ఈ సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో సామ్ కు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. విడాకుల తర్వాత స్పీడ్ పెంచిన సమంత…తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఓకే చేస్తూ బిజీగా గడిపేస్తోంది.

తాజాగా ఈ చిన్నది బాలీవుడ్ పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఈ షోలో పాల్గొంది సమంత. ఈ నేపథ్యంలో అక్షయ్ తో కలిసి స్టెప్పులేసింది సమంత. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో సామ్ నటించిన విషయం తెలిసిందే. ‘ఊ… అంటావా మావా’ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ ను అక్షయ్ తో కలిసి వేసింది సమంత. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు సామ్, అక్కీ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తో సామ్ ఓ సినిమా చేయబోతుందన్న గుసగుసలు బాలీవుడ్ లో మొదలయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి