Chinnari Photo viral: ఆర్మీ దుస్తుల్లో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ గ్లోబల్‌ స్టార్‌.. గుర్తుపట్టారా..!

Anil kumar poka

|

Updated on: Jul 21, 2022 | 8:47 AM

తండ్రి ఆర్మీదుస్తులు వేసుకొని అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌. మోడలింగ్‌తో కెరీర్‌ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మిస్‌ వరల్డ్ పోటీల్లోనూ విజేతగా నిలిచింది.


తండ్రి ఆర్మీదుస్తులు వేసుకొని అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌. మోడలింగ్‌తో కెరీర్‌ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మిస్‌ వరల్డ్ పోటీల్లోనూ విజేతగా నిలిచింది. ఆతర్వాత ఓ దక్షిణాది సినిమాతో వెండితెర రంగప్రవేశం చేసి, బాలీవుడ్‌కు మకాం మార్చింది. తనదైన అందం, అభినయంతో హిందీ చిత్రపరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అక్కడి టాప్‌ హీరోలందరితోనూ కలిసి నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అత్యధిక పారితోషకం తీసుకున్న భారతీయ నటీమణుల్లో ఒకరిగా నిలిచింది. తన అభినయ ప్రతిభకు గుర్తుగా పద్మశ్రీతో పాటు జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు ఆమె కీర్తికిరీటంలో చేరాయి. టైమ్స్‌, ఫోర్బ్స్‌ లాంటి ప్రఖ్యాత సంస్థలు వెలువరించిన అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఈ ముద్దుగుమ్మ నిలవడం విశేషం. ప్రస్తుతం ఓ అమెరికన్‌ పాప్‌ సింగర్‌ను పెళ్లాడి హాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న ఈ సొగసరి మరెవరో కాదు.. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా . ఇవాళ అంటే జూలై 18న ప్రియాంక చోప్రా బర్త్‌డే…మరి ప్రియాంక మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ మీరు కూడా ఓసారి విషెష్‌ చెప్పేయండి మరి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 21, 2022 08:47 AM