AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishi Sunak: చరిత్రకు అడుగుదూరంలో రిషి సునాక్‌.. ఐదో రౌండ్‌లోనూ ఆధిక్యం..

Rishi Sunak – UK PM Race: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునాక్ (Rishi Sunak) చరిత్రకు అడుగుదూరంలో నిలిచారు.  బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న ఆయన ..

Rishi Sunak: చరిత్రకు అడుగుదూరంలో రిషి సునాక్‌.. ఐదో రౌండ్‌లోనూ ఆధిక్యం..
Rishi Sunak
Basha Shek
|

Updated on: Jul 20, 2022 | 9:29 PM

Share

Rishi Sunak – UK PM Race: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునాక్ (Rishi Sunak) చరిత్రకు అడుగుదూరంలో నిలిచారు.  బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న ఆయన  కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల బ్యాలెట్‌ పోల్‌లో వరుసగా ఐదు రౌండ్‌లోనూ  ముందంజలో నిలిచారు. ఐదో రౌండ్లో సునక్‌ 137 ఓట్లతో అగ్రస్థానంలో నిలవగా, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ 113 ఓట్లు సాధించారు. బిజినెస్ మినిస్టర్ పెన్నీ మోర్డాంట్ 105 ఓట్లతో పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆఖరి రౌండ్‌లో సునక్, లిజ్ ట్రస్‌ల మధ్య పోటీ జరుగనుంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే రిషి బ్రిటన్‌ ప్రధాని పదవికి మరో అడుగుదూరంలో ఉన్నాడని చెప్పవచ్చు. ఫైనల్‌ రౌండ్‌లో సుమారు 1,60,000 మంది అర్హులైన కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. వీరు ఈ ఇద్దరు అభ్యర్థులలో ఎవరికైనా అనుకూలంగా ఓటు వేస్తారు. సెప్టెంబర్‌ 5న ప్రధానిని ప్రకటించనున్నారు.

గురువారం వరకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే తుది జాబితాలోకి రానున్నారు. బుధవారం జరిగిన ఐదు, నాలుగు రౌండ్లలో వరుసగా 133, 118 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచాడు రిషి. ఇక సోమవారం జరిగిన మూడో రౌండ్ ఓటింగ్‌లో మాజీ ఆర్థిక మంత్రి సునక్‌కు 115 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో రెండో రౌండ్‌లో 101 ఓట్లు రాగా, తొలి రౌండ్‌లో 88 ఓట్లు వచ్చాయి. ఇలా అన్ని దశల్లోనూ అగ్రస్థానంలో నిలిచి అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రధాని పదవికి అడుగుదూరంలో నిలిచాడు సునక్‌.

బోరిస్ రాజీనామాతో..

ఇవి కూడా చదవండి

బ్రిట‌న్‌లో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న నేప‌థ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అపద్ధర్మ ప్రధానిగా బోరిస్ కొనసాగుతున్నారు. తన సన్నిహితుడు మాజీ ఎంపీ క్రిస్ పించర్ సెక్స్ స్కాండల్, పార్టీ గేట్ కుంభకోణంతో విమర్శల పాలైన బోరిస్ జాన్సన్ బోరిస్ స్థానంలో వేరొకరిని కూర్చోబెట్టడానికి సిద్ధపడ్డ కన్సర్వేటివ్‌లు. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నుకోవడానికి ప్రక్రియను ఆ పార్టీ ఎంపీలు ప్రారంభించారు. ఈ పోటీలో నిలిచిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ గా నిలిచిన వ్యక్తే ప్రధానిగా ఎన్నికవుతారు. జులై 20 నాటికి ముగిసిన ఐదు రౌండ్లలో రిషి సునాక్ టాప్ లో కొనసాగుతున్నారు. చివరి రౌండ్లో నిలిచిన ఇద్దరి నుంచి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఒకరిని ప్రధానిగా ఎన్నుకుంటారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను టోరీలను పిలుస్తుంటారు. కన్జర్వేటివ్ పార్టీ టోరీస్ పార్టీ నుంచి ఆవిర్భవించింది. ఈ పార్టీ సభ్యులకు మరోపేరు టోరీస్.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..