అయ్యో దేవుడా.. ఆహారం కోసం శరీరాన్ని అమ్ముకుంటున్న మహిళలు.. దిగజారుతున్న ఆ దేశ పరిస్థితులు..

చేయడానికి ఉద్యోగం లేదు.. తినడానికి తిండి లేదు.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. దీంతో పిల్లల కడుపు నింపేందుకు మహిళలు తమ శరీరాలను అమ్ముకుంటున్నారు. ఆహారం, ఔషధాలకు డబ్బుల్లేక తమ దేహాలను తాకట్టుపెడుతున్నారు.

అయ్యో దేవుడా.. ఆహారం కోసం శరీరాన్ని అమ్ముకుంటున్న మహిళలు.. దిగజారుతున్న ఆ దేశ పరిస్థితులు..
Sri Lanka Crisis
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 20, 2022 | 7:44 PM

Sri Lanka Crisis: చేయడానికి ఉద్యోగం లేదు.. తినడానికి తిండి లేదు.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఏది కొనాలన్నా ధరల మోత.. ద్వీప దేశం శ్రీలంకలో ఎటు చూసినా కన్పిస్తోన్న దుర్భర పరిస్థితులివే.. ఇలాంటి నిస్సహాయ స్థితిలో శ్రీలంక మహిళలు పొట్టకూటి కోసం సెక్స్‌ వర్కర్లుగా మారుతున్నారు. పిల్లల కడుపు నింపేందుకు మహిళలు తమ శరీరాలను అమ్ముకుంటున్నారు. ఆహారం, ఔషధాలకు డబ్బుల్లేక తమ దేహాలను తాకట్టుపెడుతున్నారు. అప్పులు, అధిక ధరలు, అడుగంటిపోయిన విదేశీ మారకపు నిల్వలతో శ్రీలంక ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. పెట్రోలు, డీజిల్ నిల్వలు దాదాపుగా అయిపోయాయి. దేశ నాయకత్వం మీద ప్రజాగ్రహం తగ్గడంలేదు ‘మా నాయకులు బాగానే జీవిస్తున్నారు. వారి పిల్లలు సంతోషంగానే బతుకుతున్నప్పుడు మా పిల్లలకు ఈ దుస్థితి ఎందుకు?’ అని ప్రశ్నిస్తున్నారు తల్లులు..

మానవీయ సంక్షోభం…

ఒక్క పూట తిండి కూడా శ్రీలంక ప్రజలకు కష్టంగా మారుతోంది. స్వచ్ఛంద సంస్థలు, చర్చిలు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాల వద్ద చాలా మంది ప్రజలు బారులు తీరుతున్నారు. బ్రెడ్ కొనడానికి కూడా డబ్బులు లేవు. పిల్లలకు అప్పుడప్పుడు పాలు, అన్నం దొరుకుతాయి. కానీ కూరగాయలు కొనడం మాత్రం సాధారణ ప్రజలకు శక్తికి మించిన పనిగా మారింది. ప్రజలు డబ్బులు లేక సరుకులు, కూరగాయలు కొనలేకపోతున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తింటున్నారు. పోషకాలు బాగా ఉండే మాంసం వంటి వాటిని తీసుకోవడం మానేశారు. అందువల్ల పోషకాహార లోపం తలెత్తి అదొక పెద్ద సమస్యగా మారనుందని.. శ్రీలంకలోని యూనిసెఫ్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోషకాహార లోపంతో తీవ్రంగా బాధపడుతున్న వేల మంది చిన్నారుల కోసం విదేశీ సాయాన్ని యూనిసెఫ్ కోరుతోంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 13శాతం నుంచి 20శాతానికి పెరగొచ్చని యూనిసెఫ్‌ అంచనా వేస్తోంది. అయితే.. లంకలోని ఆసుపత్రులు కూడా దాదాపు విరాళాల మీదే నడుస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ద్వీపదేశం శ్రీలంకలో దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. దీంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ముఖ్యంగా జౌళి పరిశ్రమ కొనుగోళ్లు లేక వెలవెలబోయింది. దీంతో ఈ రంగంలో పనిచేసే వేలాది మంది మహిళలు ఉపాధి కోల్పోవడంతో ప్రత్యామ్నాయ అవకాశాలను వెతుక్కుంటున్నారు. కానీ ఎక్కడా.. ఉపాధి లభించక వేశ్యల్లా మారుతున్నారు. ఆహారం, ఔషధాలకు డబ్బుల్లేక తమ దేహాలను తాకట్టుపెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

“ఆర్థిక సంక్షోభం కారణంగా మా ఉద్యోగాలు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు సంపాదించేందుకు సెక్స్‌ వర్కే ప్రత్యామ్నాయంగా కన్పిస్తోంది. మామూలుగా మేం టెక్స్‌టైల్‌ రంగంలో నెలకు రూ.28వేల నుంచి రూ.35వేల వరకు జీతం తీసుకునేవాళ్లం. ఇప్పుడు సెక్స్‌ వర్క్‌ చేస్తే నెలకు రూ.15వేలు మాత్రమే వస్తున్నాయి. అయినా కుటుంబాన్ని పోషించాలంటే డబ్బు కావాలి. అందుకే ఈ పని చేస్తున్నాం. నేను చేసేది తప్పే కావొచ్చు. కానీ వాస్తవ పరిస్థితులు అలాగే ఉన్నాయి” – వేశ్యగా మారిన ఓ మహిళ ఆవేదన ఇది..

పిల్లలు, వృద్ధ త‌ల్లితండ్రులతో పాటు అక్కాచెల్లెండ్లను పోషించేందుకు మ‌హిళ‌ల‌కు మ‌రో మార్గం క‌నిపించ‌డం లేద‌ని.. క్విక్ మ‌నీ కోసం సెక్స్ వ‌ర్కర్లుగా మారుతున్నార‌ని లంక మ‌హిళా హ‌క్కుల సంస్ధ స్టాండ‌ప్ మూవ్‌మెంట్ లంక (ఎస్‌యూఎంఎల్‌) తెలిపింది. లంక న‌గ‌రాల్లో కొన్నిచోట్ల తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుని వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు

30శాతం పెరిగిన సెక్స్‌ వర్కర్లు..

శ్రీలంక మీడియా కథనాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు..సెక్స్‌ వర్కర్లుగా మారుతున్న మహిళల సంఖ్య 30 శాతం పెరిగిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొలంబో ఇండస్ట్రియల్‌ జోన్‌కు సమీపంలో ఈ తాత్కాలిక సెక్స్‌ వర్కర్లు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగారు. ఈ వేశ్యాగృహాలకు పోలీసుల సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బుకు బదులు దుకాణాదారులతో సంబంధాలను పెట్టుకుంటున్నారు. ఇంధనం, ఆహార, ఔషధాల కొరత మహిళలను ఈ తీవ్ర పరిస్థితుల్లోకి నెట్టేసింది. పిల్లలు, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉన్న మహిళలు ఎక్కువగా ఈ వృత్తిలోకి మారుతున్నారు. ఆహారం, మందులకు డబ్బుల్లేక స్థానిక దుకాణదారులకు బలవంతంగా తమ శరీరాలను అప్పగించి.. వాటిని కొనుక్కునే పరిస్థితికి దిగజారడం బాధాకర పరిణామాలు మానవతావాదుల గుండెలను పిండేస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..