Men Health Tips: పురుషులకు అలర్ట్.. ఈ విత్తనాలను తింటే డబుల్ స్టామినా.. ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు..

కలోంజి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోవడంతో పాటు వ్యాధులు కూడా దూరమవుతాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక శక్తిని సైతం ఈ గింజలు పెంపొందిస్తాయి.

Men Health Tips: పురుషులకు అలర్ట్.. ఈ విత్తనాలను తింటే డబుల్ స్టామినా.. ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు..
Kalonji Seeds
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 19, 2022 | 8:07 PM

Kalonji Seeds Benefits For Male: నేటి ఆధునిక కాలంలో జీవనశైలి, మంచి ఆహారం తీసుకోని కారణంగా చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా పురుషుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నల్లగా ఉండే కలోంజీ విత్తనాలు పురుషులకు అమృతంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కలోంజి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోవడంతో పాటు వ్యాధులు కూడా దూరమవుతాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక శక్తిని సైతం ఈ గింజలు పెంపొందిస్తాయి. ముఖ్యంగా కలోంజి విత్తనాలు పురుషుల్లో శరీర శక్తిని పెంచేందుకు చాలా మేలు చేస్తాయి. నేటి కాలంలో పురుషులలో వంధ్యత్వ సమస్య బాగా పెరిగిపోయింది. అటువంటి పరిస్థితిలో వంధ్యత్వాన్ని తొలగించడానికి కలోంజి గింజల వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కలోంజీని తీసుకోవడం వల్ల పురుషులకు ఎంత మేర మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి..

పురుషులకు కలోంజి ప్రయోజనాలు..

వంధ్యత్వ సమస్య నుంచి ఉపశమనం: కలోంజి గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను సెక్స్ హార్మోన్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కలోంజి గింజలను కూడా తీసుకుంటే వంధ్యత్వ సమస్యను చాలా సులభంగా ఎదుర్కోవచ్చు. రోజూ తింటే పురుషుల్లో నపుంసకత్వం దూరమై.. లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

ప్రోస్టేట్ క్యాన్సర్‌ నుంచి కాపాడతాయి: కలోంజి గింజలను తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్య దూరమవుతుంది. ఇందులో ఉండే సాటివా ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా మేలు చేస్తుంది. కావున ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి కలోంజి తీసుకోవడం మంచిది.

సత్తువ పెంచడంలో సహాయపడతాయి: పురుషుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి కలోంజి గింజల వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కలోంజీని పాలలో కలిపి తాగడం వల్ల స్టామినా డబుల్ పెరుగుతుంది. వీటిని తీసుకోవడం ద్వారా బలహీనత సమస్య కూడా దూరమవుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్తహీనత కూడా తొలగిపోతుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది: జుట్టు రాలుతుంటే కలోంజి గింజలను తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజూ జుట్టుకు కలోంజి ఆయిల్ వాడితే మంచిది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా మారేలా చేస్తాయి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..