Chef Mantra: ఆకట్టుకున్న చెఫ్ మంత్ర.. స్వీట్ కోసం రెజీనా కాసాండ్రా చెప్పిన అబద్దం ఏంటో తెలుసా
Chef Mantra: ఎప్పటికప్పుడు అద్భుతమై ప్రోగ్రామ్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా మరో సరికొత్త, ఎగ్జయిటింగ్ వంటల టాక్ షో చెఫ్ మంత్రతో ప్రేక్షకులను అలరించింది.
ఎప్పటికప్పుడు అద్భుతమై ప్రోగ్రామ్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా(Aha)ఇటీవల సరికొత్త, ఎగ్జయిటింగ్ వంటల టాక్ షో చెఫ్ మంత్ర(Chef Mantra)తో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు టీవీ 9 ఎంటర్టైన్మెంట్(TV9 Entertainment) యూట్యూబ్ ఛానల్‌లో మరోసారి ప్రసారం కానుంది ఈ షో. ఆహా ఇన్ హౌస్ క్రియేటివ్ టీమ్ డెవలప్ చేసిన తొలి షో ఇది. ఫిక్షనరి ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తోన్న ఈ షోకు ప్రముఖ టెలివిజన్ యాంకర్, నటి శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించారు. నిజానికి శ్రీముఖి వంటలను బాగా ఆస్వాదించే వ్యక్తి. ఈ షోలో తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంది సెలబ్రిటీలు భావోద్వేగాలే కాకుండా మరో కోణాన్ని చూపించారు.
సెలబ్రిటీలో ఈ షోలో పాల్గొని వంటలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నఈ చెఫ్ మంత్రలో పాపులర్ తెలుగు ఫిల్మ్ స్టార్స్ వారి అభిమాన చెఫ్స్‌తో కలిసి ఇష్టమైన వంటను చేయడమే కాకుండా, వారి ప్రయాణంలోని జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. సెలబ్రిటీలు ఎంపిక చేసుకునే ఫడ్ వారి జీవన శైలి, వ్యక్తిత్వాలను తెలియజేసేవిగా ఉంటాయి. అంతే కాకుండా సదరు సెలబ్రిటీల్లో సరదా కోణాన్ని కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. క్రేజీ హీరోయిన్ రెజీనా కాసాండ్రా హాజరైన ఈ ఎపిసోడ్ ను ఇప్పుడు టీవీ 9 ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్‌లో చూసి ఆనందించండి.