Viral Video: ఐస్‌క్రీం అంటే మరి ఇంత పిచ్చా..? ఎంత లాగినా రాదాయే.. నెట్టింట శునకం వీడియో వైరల్

అందుకే ప్రేమతో శునకాలను చేరదీసి కొంచెం అన్నం పెడితే చాలు.. అవి మనతోనే ఉండిపోతాయి. యజమాని ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడవు. వాటికి ప్రత్యేకించి ఎలాంటి ఆహారం ఇవ్వవలసిన అవసరం లేదు.

Viral Video: ఐస్‌క్రీం అంటే మరి ఇంత పిచ్చా..? ఎంత లాగినా రాదాయే.. నెట్టింట శునకం వీడియో వైరల్
Dog Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 19, 2022 | 3:24 PM

Dog Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ శునకానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లంతా తెగ నవ్వుకుంటున్నారు. సాధారణంగా జంతువులు కూడా ఆకలితో ఉంటాయి. అందుకే ప్రేమతో శునకాలను చేరదీసి కొంచెం అన్నం పెడితే చాలు.. అవి మనతోనే ఉండిపోతాయి. యజమాని ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడవు. వాటికి ప్రత్యేకించి ఎలాంటి ఆహారం ఇవ్వవలసిన అవసరం లేదు. మనం ఏం తింటే అది.. కాస్త పెడితే చాలు.. విశ్వాసంగా జీవితాంతం ఉంటాయి. అందుకే కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా పేర్కొంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫన్నీ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. కుక్క బ్యానర్‌పై ఉన్న ఐస్ క్రీం ను తినాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇది చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

సాధారణంగా ఐస్ క్రీం అంటే అందరికీ చాలా ఇష్టం. అయితే.. కుక్కలు కూడా ఐస్ క్రీం తినేందుకు తెగ ఇష్టపడుతున్నాయి. అందుకు నిదర్శనం ఈ వైరల్ వీడియోనే. దీనిలో ఉన్న పెంపుడు కుక్క.. ఐస్‌క్రీం చిత్రాలను చూసి టెంప్ట్ అయ్యింది. ఇక ముందు వెనక ఆలోచించకుండా.. బ్యానర్ మీద ఉన్న ఐస్ క్రీంను తినేందుకు శునకం ప్రయత్నించడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. పాపం దానికి ఐస్‌క్రీమ్‌ చిత్రం అన్న విషయం తెలియదు. అందుకే బ్యానర్ మీద ఉన్న చిత్రాలను చూసి శునకం టెంప్ట్ అయి.. కొరుకుటం ప్రారంభించింది. ఐస్‌క్రీమ్‌ను తినేందుకు తినేందుకు ఎంతగానో ప్రయత్నించింది.. కానీ.. దానికి ఐస్‌క్రీం కాదన్న విషయం చివరి వరకు అర్థం కాలేదు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో Buitengebieden అనే యూజర్ షేర్ చేసింది. కేవలం 22 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 1.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతోపాటు 52 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసి.. నెటిజన్లు పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!