Watch video: షేన్‌వార్న్ పూనాడా ఏంటి బ్రో.. సేమ్ టూ సేమ్.. ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’తో బ్యాటర్‌కు షాకిచ్చిన స్పిన్నర్..

షేన్ వార్న్ స్వయంగా యాసిర్ షా బౌలింగ్‌కు పెద్ద అభిమాని. వైట్ బాల్ క్రికెట్‌లో అత్యంత ఇష్టమైన స్పిన్నర్ ఎవరు అని వార్న్‌ను ఒకసారి అడిగినప్పుడు..

Watch video: షేన్‌వార్న్ పూనాడా ఏంటి బ్రో.. సేమ్ టూ సేమ్.. 'బాల్ ఆఫ్ ది సెంచరీ'తో బ్యాటర్‌కు షాకిచ్చిన స్పిన్నర్..
Pakistan Vs Sri Lanka Test Ball Of The Century Nomination
Follow us
Venkata Chari

|

Updated on: Jul 19, 2022 | 3:51 PM

పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా వేసిన బంతి ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్‌ను గుర్తు చేసిందంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోమవారం గాలే టెస్టులో యాసిర్ ఈ బంతిని విసిరాడు. లెగ్‌ స్టంప్‌పై పడిన ఈ బంతి శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ కుశాల్‌ మెండిస్‌ ఆఫ్‌ స్టంప్‌ను తాకింది. దీంతో బిత్తరపోవడం బ్యాటర్ వంతైంది. దీంతో యాషెస్ సందర్భంగా షేన్ వార్న్ వేసిన సెంచరీ బంతిని ప్రజలు గుర్తుంచుకుంటున్నారు. ఏడాది తర్వాత యాసిర్ మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో పాకిస్థాన్ తొలి టెస్టు ఆడుతోంది. యాసిర్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు.

యాసిర్‌ను అత్యుత్తమ బౌలర్‌గా పేర్కొన్న వార్న్..

ఇవి కూడా చదవండి

షేన్ వార్న్ స్వయంగా యాసిర్ షా బౌలింగ్‌కు పెద్ద అభిమాని. వైట్ బాల్ క్రికెట్‌లో అత్యంత ఇష్టమైన స్పిన్నర్ ఎవరు అని వార్న్‌ను ఒకసారి అడిగినప్పుడు.. అతను యాసిర్ షా, రషీద్ ఖాన్, కుల్దీప్ యాదవ్ పేర్లను పేర్కొన్నాడు. వన్డేలు, టీ20ల్లో వారితే ఆధిపత్యమని చెప్పుకొచ్చాడు. ముగ్గురు గొప్ప ఆటగాళ్లు అంటూ చెప్పుకొచ్చాడు.

వార్న్ సెంచరీ బంతికి 32 ఏళ్లు..

షేన్ వార్న్ ఈ ఏడాది మార్చి 4న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్‌లో అతని మృతదేహం లభ్యమైంది. 1990లో యాషెస్ టెస్టు సందర్భంగా వార్న్ బౌలింగ్‌లో సెంచరీ ఆఫ్ సెంచరీ సాధించాడు. ముందు ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. వార్న్ బౌలింగ్‌లో లెగ్ స్టంప్ వెలుపల బంతిని విసిరాడు. గ్యాటింగ్ వైడ్ గా వెళుతుందని భావించాడు. కానీ, బంతి ఆఫ్-స్టంప్‌లను తాకింది. ఈ బంతి క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బంతుల్లో ఒకటిగా పరిగణించారు.

గాలె టెస్టు పరిస్థితి..

గాలె టెస్టులో శ్రీలంక పటిష్ట స్థితిలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌పై 9 వికెట్లకు 329 పరుగులు చేసింది. జట్టు 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 218, శ్రీలంక 222 పరుగులు చేశాయి. మూడో రోజు ఆటలో దినేష్ చండిమాల్ (86 నాటౌట్)తో పాటు ఓషద ఫెర్నాండో (64), కుసాల్ మెండిస్ (76) అర్ధ సెంచరీలతో రాణించారు. ఈ గడ్డపై శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్‌లో అతిపెద్ద లక్ష్యాన్ని సాధించింది. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల నష్టానికి 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..