Pumpkin Seeds Benefits: గుమ్మడిగింజలతో 4 అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టలేరు..

గుమ్మడికాయ గింజల్లో B1, B2, B3, B5, B6, B9, C, E, K వంటి విటమిన్‌లు ఉంటాయి. వీటిని ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. అలాగే ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

Pumpkin Seeds Benefits: గుమ్మడిగింజలతో 4 అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టలేరు..
Pumpkin Seeds
Follow us
Venkata Chari

|

Updated on: Jul 18, 2022 | 6:54 PM

గుమ్మడికాయ గింజల్లో వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇవి సూపర్‌ఫుడ్ గ్రూపు కిందకు వస్తాయి. గుమ్మడికాయ గింజలకు కొన్ని వందల ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. వీటి ఔషధ గుణాలకు ఎంతో గుర్తింపు ఉంది. ఈ గింజలు మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర నాళాలు, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటును నయం చేయడానికి ఉపయోగించేందుకు ఉపయోగిస్తారని తెలిసిందే. గుమ్మడికాయ గింజలు B1, B2, B3, B5, B6, B9, C, E, K వంటి విటమిన్‌లతో నిండి ఉంటాయి. ఈ గింజలను ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

గుమ్మడికాయ గింజల ఆరోగ్య ప్రయోజనాలు..

క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.. సైన్స్ డైరెక్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల కొలొరెక్టల్, రొమ్ము, కడుపు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే గుమ్మడి గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయంట.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్ నిర్వహణలో ఎంతో బెస్ట్..

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, గుమ్మడికాయ గింజలు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, దీనిని నిరూపించడానికి మరింత పరిశోధన అవసరం.

నిద్ర నాణ్యత పెంచడంలో..

గుమ్మడికాయ గింజల్లో అమినో యాసిడ్ ఉంటుంది. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఈ విత్తనాలు ట్రిప్టోఫాన్, జింక్, మెగ్నీషియంతో నిండి ఉంటాయి. ఇవన్నీ మంచి నిద్రను పెంచడంలో సహాయపడతాయి. నిద్రపోయే ముందు 1 గ్రా గుమ్మడికాయ గింజలను తింటే చాలా మంచిది.

ఎముకలను బలం కోసం..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, మెగ్నీషియం ఎముకలు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. రక్తపోటు, రక్తంలో చక్కెర, గుండె, ఎముకల ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన మెగ్నీషియం స్థాయిలు అవసరం. గుమ్మడికాయ గింజలు ఎముకలు పగుళ్లు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి.

  1. గుమ్మడికాయ గింజలను ఎలా ఉపయోగించాలంటే..
  2. స్మూతీస్‌లో గార్నిష్ చేసుకోవచ్చు..
  3. పెరుగు లేదా తృణధాన్యాలలో కలిపి తినొచ్చు..
  4. సలాడ్‌తోపాటు తీసుకోవచ్చు..
  5. కుకీలుగా చేసుకుని తినొచ్చు..

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం అందించాం. ఏదైనా చిట్కాలు, మందులు, ఆహారాన్ని తినేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.